friendship day 2023 : కోపం నీటిమీద రాత అయితే .. చెలిమి శిలమీద రాత అవుతుంది ..

కోపం. మనుషుల్ని దూరం చేస్తుంది. స్నేహితుల మధ్య వైరాన్ని పెంచుతుంది.అటువంటి కోపం స్నేహితుల మధ్య ఎలా ఉండాలో ఓ కవి చాలా గొప్పగా చెప్పాడు. ఈ మాట ప్రతీ స్నేహితుడు అన్వయించుకుంటే ఆ స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది.

Friendship is strength

2023 friendship day  : మన పుట్టుక మన చేతిలో లేదు. కానీ మంచి స్నేహితుడుని సంపాదించుకోవటం మనచేత్లోనే ఉంది. నీ స్నేహితుడు ఎటువంటివాడో తెలిస్తే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుందంటారు. కానీ స్నేహంలో కోపం అనేది చాలా చేటు చేస్తుంది. స్నేహితులమీద కోపం వస్తే అది తాటాకు మంటలా ఉండాలి తప్ప..చింతనిప్పులా మండకూడదని పెద్దులు చెబుతారు. ఈ సృష్టిలో ఎన్నో బంధాలకు ‘బ్రేకప్’లు ఉంటాయి గానీ స్నేహానికి ‘బేకప్’లు ఉండవు. ప్రేమికుల మధ్య ‘బ్రేకప్’. భార్యా భర్తల మధ్య ‘బ్రేకప్’. కానీ స్నేహానికి మాత్రం ‘బ్రేకప్’ ఉండదు. ఉండకూడదు.అలా ఉంటే అది స్నేహం అనిపించుకోదు.

friendship day 2023 : నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో చెప్పిన మానసిక తత్వవేత్త .. మీరు అలా ఉన్నారా..?

ఓ కవి స్నేహితులకు ఒకరిపై మరొకరికి కోపం వస్తే ఎలా ఉండాలి అనే మాటను చాలా చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ మాట ఈ ప్రపంచంలోనే ప్రతీ స్నేహితులకు సక్కగా సరిపోతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేమంటే ‘కోపం జలాక్షం అయితే చెలిమి శిలాక్షరం అవతుంది’..నిజమే కాదా..కోపం నీటిమీద రాతలా ఉంటే స్నేహం శిలమీద అక్షరంగా ఎప్పటికి నిలిచిపోతుంది.అంటే ఈ విలువైన మాటకు అర్థం ఏమిటంటే..స్నేహితులపై ఏ సందర్భంలో అయినా కోపం వస్తే అది వెంటనే తగ్గిపోవాలి..అంటే నీటి మీద మనం ఏమైనా రాస్తే అది వెంటనే చెదిరిపోతుంది. అదే శిలమీద (రాయి) మీద రాస్తే (చెక్కితే) అది శాశ్వతంగా ఉండిపోతుంది. చరిత్రలో నిలిచిపోతుంది.

Friendship Day 2023 : క్యాన్సర్‌తో బాధపడుతున్న స్నేహితురాలికి అండగా నిలబడిన బాల్య స్నేహితులు .. ఇదే కదా అసలైన స్నేహమంటే

రవి గాంచని చోట కవి గాంచున్ అంటారు. అంటే సూర్యకిరణాలు సోకని చోటును కూడా కవి తన సృజనాత్మకతతో చూసి అక్షరాల్లో దాన్ని ఆవిష్కరిస్తాడు. అలా ఎంతోమంది కవులు స్నేహం గురించి స్నేహం గొప్పతనం గురించి ఎన్నో చెప్పారు. అటువంటి మాట ఈ పదం… ‘కోపం జలాక్షం అయితే చెలిమి శిలాక్షరం అవతుంది’..ఇది ఏ స్నేహితులకైనా ఇట్టే నప్పుతుంది. ఈ మాటను ప్రతీ స్నేహితుడు అన్వయించుకుంటే వారి స్నేహం చిరకాలం నిలిచిపోతుంది. ఎప్పటికి చెక్కుచెదరని చరిత్రగా మిగిలిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.