సీన్ రివర్స్ : కాటేసిన అత్యంత విషపూరితమై పామునే మింగేసిన కప్ప..!!

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 06:18 AM IST
సీన్  రివర్స్ : కాటేసిన అత్యంత విషపూరితమై పామునే మింగేసిన కప్ప..!!

Updated On : February 7, 2020 / 6:18 AM IST

ప్రాణికి ప్రాణీ జీవాధారం. చిన్న ప్రాణుల్ని పెద్ద ప్రాణులు తినేస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మంలో భాగంగా పాములు కప్పల్ని తింటాయి. కానీ..ప్రకృతి ధర్మం రివర్స్ అయ్యింది. అది కాల మహిమ కావచ్చు..మరేదైనా కావచ్చు. అటువంటిదే జరిగింది. ఓ విషపూరితమైన పాముని ఓ ఆకుపచ్చరంగు కప్ప గుటకాయస్వాహా చేసేసింది. ఇది ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ డేరింగ్ కప్ప ‘‘ట్రీ ప్రాగ్’’.

ట్రీ ప్రాగ్…గ్రీన్ కలర్‌లో ఉంటూ…ఆకుల్లో కలిసిపోతుంది. పరీక్షగా చూస్తేనే గానీ అది కప్ప అనే సంగతి తెలీదు. ఆ ఆకుపచ్చ రంగు కప్ప ఓ విషపూరితమైన పాముని మింగేసింది. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ట్రీ ప్రాగ్.. కోస్టల్ తైపాన్ అనే పామును తినేసింది. దాన్ని మింగిన కప్ప చనిపోతుందని అనుకున్నారు. ఎందుకంటే.. ప్రపంచంలోనే మూడో అత్యంత విషపూరితమైన జాతి పాము…! కానీ కప్ప మాత్రం చనిపోలేదు బతికేవుంది..!!

ఈ కప్ప పాముని మింగిన విషయం ఎలా బైటపడిందంటే..ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్‌లో ఓ మహిళ తన ఇంటి వెనక తోటలో పామును చూసింది. వెంటనే స్నేక్ టేక్ ఎవే సంస్థకూ, ఛాపెన్ పెస్ట్ కంట్రోల్ సంస్థకూ ఫోన్ చేసిన చెప్పింది. వెంటనే వచ్చిన స్నేక్ టేక్ ఎవే సంస్థ ప్రతినిధులు పాము కోసం వెదికారు. 

పాము పెరట్లో ఉందనీ..ఆ పాముని ఓ ఆకుపచ్చరంగు కప్ప మింగేస్తోంది అని చెప్పింది.  వెంటనే వాళ్లు అక్కడకు వెళ్లి చూసేసరికి అప్పటికే ఆ పాము పిల్లను ఆ కప్ప చాలావరకూ మింగేస్తూ కనిపించింది. అది చూసినవాళ్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే..పాముని కప్ప మింగేయటం ఓ మిరాకిల్ అయితే అంత విషపూరితమైన పాముని మింగిన తరువాత కూడా ఆ కప్ప బతికే ఉండటాన్ని చూసి విపరీతంగా ఆశ్చర్యపోయారు. 

పాముని మింగేందుకు కప్ప..కప్పను కాటేందుకు పాము యత్నిస్తున్న క్రమంలో  కోస్టల్ తైపాన్ పాము కప్పను పలుసార్లు కాటేసింది. అయినా సరే కప్పే చివరికి విజయం సాధించింది. చివరకు పాముని కప్ప మింగేసింది. 

కోస్టల్ తైపాన్ పాము ఒక్కసారి కాటేసినా చాలు… బాడీలో లోపలికి విషం చాలా ఫాస్ట్ గా ఫామ్ అయిపోతుంది. ఆ విషం… వెంటనే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు బాడీలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. తరువాత విపరీతమైన తలనొప్పి, వికారం, ఎముకలు చిట్లిపోవడం, అంతర్గంత రక్తస్రావం, కిడ్నీలు పాడైపోవడం ఇలా ఎన్నో అనర్థాలు జరుగుతాయి…!!
అంతటి విషపూరితమైన కోస్టల్ తైపాన్ పాము మింగేసిన కప్ప బతికే ఉండటం వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. జనరల్‌గా పాములే కప్పల్ని తింటాయి. ఇక్కడ అందుకు రివర్సులో జరగడంతో… ఇందుకు సంబంధించిన కప్ప ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ ఫొటోలు ఆటోమేటిక్‌గా వైరల్ అయ్యాయి.

కాగా..పామును మింగిన కప్ప… తిరిగి దాన్ని కక్కేస్తుందేమోనని… ఆ కప్పను తనతో తీసుకెళ్లారు మిస్టర్ ఛాపెల్. ఐతే… ఆ కప్ప పామును కక్కకుండా ఆరగించేసుకుంది. దాంతో… ఆ కప్పను మెచ్చుకుంటూ… తిరిగి దాన్ని ఆమె పెరట్లో వదిలేయడానికి తీసుకెళ్తానని చెప్పారు.