Historical Trillionaires: వీళ్ల ఆస్తుల ముందు మస్క్ సంపద జుజుబి.. ఈ రాజుల ఆస్తులు ఎన్ని ట్రిలియన్ డాలర్లంటే
మస్క్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించగా, ఇప్పుడు ట్రిలియనీర్(Historical Trillionaires) క్లబ్‌లోకి చేరడం మరో విశేషంగా మారింది.
From akbar to genghis khan historical trillionaires richer than elon musk
- మస్క్‌ను మించిన చారిత్రక కుబేరులు
- ట్రిలియన్ల సంపదతో చక్రవర్తుల చరిత్ర
- చెంఘిజ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు
Historical Trillionaires: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనత సాధించినట్లు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్పేస్ఎక్స్ షేర్ల విలువ భారీగా పెరగడంతో ఆయన ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా నిలిచారనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఇది ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తున్నారు. వ్యాపారవేత్తగా, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వ్యక్తిగా మస్క్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించగా, ఇప్పుడు ట్రిలియనీర్(Historical Trillionaires) క్లబ్‌లోకి చేరడం మరో విశేషంగా మారింది.
చరిత్రకారుల వాదన.. మస్క్ కంటే ముందే ట్రిలియనీర్లు:
అయితే మస్క్ సాధించిన ఈ ఘనతను కొందరు చరిత్రకారులు భిన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. నేటి డాలర్ల విలువ ప్రకారం లెక్కలు వేస్తే, గతంలో ప్రపంచాన్ని ఏలిన అనేక మంది చక్రవర్తులు, సామ్రాజ్యాధిపతులు, పాలకులు మస్క్‌ను మించిన సంపద కలిగి ఉన్నారని చెబుతున్నారు. వారు పాలించిన రాజ్యాల విస్తీర్ణం, పన్నుల ఆదాయం, సహజ వనరులపై నియంత్రణ, అంతర్జాతీయ వాణిజ్య ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి సంపదను అంచనా వేస్తున్నారు.
ప్రపంచాన్ని ఏలిన అపార సంపదల చక్రవర్తులు:
రష్యా మహారాణి కాథరిన్ ది గ్రేట్, రోమన్ చక్రవర్తి అగస్టస్, సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్, చైనా సామ్రాజ్ఞ వూ జెటియన్, మొఘల్ చక్రవర్తి అక్బర్, మాలి సామ్రాజ్యాధిపతి మాన్సా మూసా వంటి పాలకులు ట్రిలియన్ల డాలర్ల విలువైన సంపదను నియంత్రించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. వీరి సంపద కేవలం వ్యక్తిగత ఆస్తులతో కాకుండా, వారి ఆధీనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థల పరిమాణాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
చెంఘిజ్ ఖాన్ నుంచి షెన్జోంగ్ వరకు:
ఈ జాబితాలో ప్రత్యేకంగా నిలిచేది చంఘీజ్ ఖాన్. ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించిన మంగోల్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన సంపద నేటి విలువలో వందల ట్రిలియన్ల డాలర్లకు సమానమని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అలాగే చైనా సాంగ్ సామ్రాజ్య చక్రవర్తి సాంగ్ వంశపు షెన్జోంగ్ చక్రవర్తి కూడా అపారమైన ఆర్థిక శక్తిని కలిగి ఉన్న పాలకుడిగా గుర్తింపు పొందారు. దీంతో ఎలాన్ మస్క్ ఆధునిక ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచినా, చరిత్ర పుటల్లో ఆయనకంటే ఎక్కువ సంపదను నియంత్రించిన మహారాజులు, చక్రవర్తులు ఇప్పటికే ఉన్నారనే వాదన ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
