బాలికపై 30 మంది గ్యాంగ్ రేప్..మిన్నంటిన నిరసనలు

ప్రపంచ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్కరు..కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 30 మంది ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనిపై ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై దేశ ప్రధాని ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, మానవ సమాజానికే మచ్చగా అభివర్ణించారు. ఇజ్రాయిల్ లో ఈ ఘోరాతి ఘోరం జరిగింది. ఈ వార్త విన్న వారు ఉలిక్కి పడ్డారు.
ఈలత్ నగరంలోని రెడ్ సీ రిసార్ట్ చూసేందుకు ఓ బాలిక వచ్చింది. ఈమెను చూసిన కామాంధులు కొంతమంది బలవంతంగా ఎత్తుకొచ్చారు. అదే రిసార్ట్ లో బంధించారు. ఒకరు తర్వాత ఒకరు..30 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగొలా కామాంధుల నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనను దేశ ప్రజలు తీవ్రంగా ఖండించారు. స్వచ్చందంగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టారు. క్రూరమైన నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ ఘటన షాకింగ్ గా ఉందని, విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ ఖండించారు.