Georgia women opens porch restaurant for chipmunk Squirrel : కరోనా కష్ట సమయంలో ఎంతోమందికి ఉపాధిని కోల్పోవటంతో క్రియేటివిటీ ఐయాలతో కొత్త దారుల్లో ఉపాధి క్రియేట్ చేసుకుంటున్నారు. అటువంటి మహిళ ఉడుతల కోసం ఓ రెస్టారెంట్ ప్రారంభించింది.
కరోనా మహమ్మారి వల్ల రెస్టారెంట్లు, హోటళ్లు అన్ని మూతబడిపోయాయి. కానీ..జార్జియాలోని ఏంజెలా హన్స్ బెర్గర్ అనే మహిళకు వచ్చిన చక్కటి ఆలోచనతో ఉడుతలకు మాత్రం అద్భుతమైన అవకాశం దక్కింది. ఆమె ప్రారంభించిన ఉడుత రెస్టారెంట్ కు ప్రతీరోజు ఉడుతలు వచ్చి చక్కగా ఆమె పెట్టిన ఆహారం తిని వెళుతున్నాయి.
అట్లాంటాకు చెందిన ఏంజెలా ఫుడ్ రైటర్‌గా పని చేస్తూంటుంది. రెస్టారెంట్లకు వెళ్లి, అక్కడ భోజనం చేసి దానికి రేటింగ్ ఇస్తూ.. రివ్యూలు రాస్తూ ఉంటుంది. ఫుడ్ రైటర్ గా ఆమెకు మంచి పేరు ఉండటంతో ఆమె ఫుడ్ కు ఇచ్చే రేటింగ్స్ చూసి ఆ రెస్టారెంట్లకు మంచి గిరాకీ పెరుగుతుంటుంది. కానీ కరోనా వల్ల రెస్టారెంట్లు..హోటల్స్ మూతపడటంతో ఆమె ఉపాధికి గండిపడింది.
రాస్టారెంట్లు మూసేయడంతో ఆమె రైటింగ్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలీక ఖాళీగా ఉండిపోయింది. ఓ రోజు అలా ఆమె తన ఇంటి లాన్ లో కూర్చుని ఆలోచిస్తోంది. అప్పుడే ఆ లాన్ లోకి చిప్‌మంక్ జాతికి చెందిన ఉడుతలు తిరుగుతూ కనిపించాయి. అవి ఆహారం కోసం వెతుక్కోవటం చూసిన ఆమెకు వాటికి ఏదైనా చేయాలనే ఆలోచన చేసింది.
ఒకరోజు ఆమెకు తన మామయ్య.. ఓ చిన్న చెక్క పిక్ నిక్ టేబుల్‌ను పంపారు. దాన్ని ఉడుతల కోసం తన ఇంటి ముందున్న గార్డెన్‌లో పెట్టింది. దానిపై ఉడుతలకు సరిపోయేలా చిన్న చిన్నపాటి ప్లేట్లు, సాసర్లూ పెట్టి వాటిలో వాల్‌నట్స్ నిండుగా పెట్టింది.
అవి చూడగానే ఓ ఉడుత ఎగురుకుంటూ వచ్చి వాల్ నట్స్ మొత్తం తినేసి ప్లేటు చిటికెలో ఖాళీ చేసి వెళ్లిపోయింది. మరునాడు కూడా ఆ ఉడుత మళ్లీ వచ్చింది. అప్పటికే ఏంజెలా పెట్టిన వాల్ నట్స్ తినేసి వెళ్లిపోయింది. దీంతో ఏంజెలా ఉడుతల కోసం ఓ రెస్టారెంట్ పెట్టాలని నిర్ణయించుకుంది.
అలా ఏప్రిల్ నుంచి వాటికి కావాల్సిన ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేస్తూ వాటికి ఆహారం పెడుతోంది. రకరకాల గింజలు పెడుతూ రోజుకో రకంగా రెస్టారెంట్‌ను చక్కగా అందంగా తీర్చి దిద్దేది. ఓ రోజు బర్త్ డే సెటప్, మరో రోజు చిన్నపాటి గుడారం వేసి కలర్ ఫుల్ గా డెకరేట్ చేసేది.
ఇంకోరోజు పిక్‌నిక్ టేబుల్ ఇలా కొత్త కొత్తగా డెకరేట్ చేసేది. అలా ఉడుతలు రావటం చక్కగా నిర్భయంగా నట్స్ తినేసి వెళ్లిపోవటం జరిగేది.వాటిపై ఏంజెలా అనేక ఆర్టికల్స్ రాస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంది. ఈ రెస్టారెంట్ సెటప్ వల్ల తనకు ఉపాధితో పాటు ఆనందం కూడా దక్కడంతో ఉడుతల రెస్టారెంట్ గురించి రోజుకో విషయాన్ని ఆర్టికల్ రూపంలో రాస్తోంది. ఏంజెలా ఉడుతల కోసం ఏర్పాటుచేసిన రెస్టారెంట్ ను రోజుకో రకంగా డెకరేట్ చేసే ఆమె ఐడియాను పలువురు ప్రశంసిస్తున్నారు.