సోషల్ మీడియా పుణ్యమా అని ఐడియాలు పంచుకోవడానికి ఓ చక్కని వేదిక దొరికింది. కొత్తవి చెత్తవైనా పర్లేదు.. విచ్ఛలవిడిగా వాడేస్తున్నారు. ఇందులో భాగంగానే టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు క్రేజీ వీడియోలు కనిపిస్తున్నాయి. కాలితో బాటిల్ క్యాప్‌లు ఓపెన్ చేయడం, వింత ఫీట్‌లు చేయడం వంటివి చూశాం. ఇటీవల ఓ యువతి తన ఉమ్మితో ఫోన్‌ను ఆపరేట్ చేస్తుంది.
ఉమ్ముతో ఫోన్ అన్ లాక్ చేయడంతో పాటు అందులో ఉన్న యాప్స్ ఓపెన్ చేస్తుంది. ఈ 19ఏళ్ల జెస్సికా బెర్నీర్.. సవన్నా రెస్టారెంట్‌లో చేసిన ఈ స్టంట్ నెట్టింట్లో హల్‌చల్‌గా మారింది. ఫోన్ పాస్ వర్డ్ అంకెలపై ఉమ్మివేసి అన్ లాక్ స్నాప్ చాట్ యాప్ ఓపెన్ చేసింది. దీనిని ఆమె బాయ్ ఫ్రెండ్ ర్యాన్ టిక్ టాక్ యాప్ లో అప్ లోడ్ చేశాడు. జెస్సికా చేసిన ట్రిక్ అర్థం కాక కొందరు, వింత ఫీలింగ్ తో మరి కొందరు తెగ షేర్ చేస్తున్నారు.
నా గర్ల్ ఫ్రెండ్ ను బయటకు తీసుకొస్తే జరిగింది ఇది అంటూ ఆమె బాయ్ ఫ్రెండ్ పోస్టు చేశాడు. ఈ విడియోను లక్షా 64వేల లైక్‌లు, 2వేల 700 కామెంట్లు వచ్చాయి. ఇక దీనికి 16వేల 700మంది షేర్ చేసుకున్నారు. ఇది కాదా క్రేజీ అంటే..