Google Location: అబార్షన్ చేసే క్లినిక్​లపై కన్నేసిన గూగుల్

అబార్షన్ చేసే క్లినిక్ లకు వెళ్లి వచ్చే వారి లొకేషన్ డేటాను ఆటోమేటిక్ డిలీట్ అయ్యేలా ప్లాన్ చేసింది గూగుల్. అబార్షన్ క్లినిక్స్, డొమెస్టిక్ వయోలెన్స్ షెల్టర్స్, వెయిట్ లాస్ క్లినిక్స్, ఇతర పొటెన్షియల్ సెన్సిటివ్ లొకేషన్ల డేటాను డిలీట్ చేయనున్నారు. ఈ ప్లేసులకు వెళితే వారి డేటాను సులువుగా పసిగట్టేస్తుంది.

Google Location: అబార్షన్ చేసే క్లినిక్ లకు వెళ్లి వచ్చే వారి లొకేషన్ డేటాను ఆటోమేటిక్ డిలీట్ అయ్యేలా ప్లాన్ చేసింది గూగుల్. అబార్షన్ క్లినిక్స్, డొమెస్టిక్ వయోలెన్స్ షెల్టర్స్, వెయిట్ లాస్ క్లినిక్స్, ఇతర పొటెన్షియల్ సెన్సిటివ్ లొకేషన్ల డేటాను డిలీట్ చేయనున్నారు. ఈ ప్లేసులకు వెళితే వారి డేటాను సులువుగా పసిగట్టేస్తుంది.

“లొకేషన్ హిస్టరీ నుంచి ఈ ఎంట్రీలను డిలీట్ చేస్తాం. ఈ సౌకర్యం మరికొద్ది రోజుల్లోనే అమల్లోకి రానుంది” అని టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది.

అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కంపెనీ ఈ ప్రకటన వెల్లడించింది. అంతేకాకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు అబార్షన్ పిల్స్ కు సంబంధించిన పోస్టులను డిలీట్ చేస్తున్నాయి. గూగుల్ ఫిట్, ఫిట్ బిట్ లు యూజర్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకుని పర్సనల్ డేటా ఛేంజ్ చేసుకోవడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవడం కోసం యాక్సెస్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Read Also : యూట్యూబ్ చూసి అబార్షన్‌కు యత్నించిన బాలిక, చివరికి…!

ఉదాహరణకు ఫిట్ బిట్ యూజర్లు మెన్ స్ట్రువల్ సైకిల్స్ గురించి యాప్ లో ఉన్న డేటా కావాలనుకుంటే ఒక్కసారిగా డిలీట్ చేసేయొచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు