Abortion Rights: అబార్షన్ హక్కుల కోసం మహిళల పాదయాత్ర

పదివేల మందికి పైగా మహిళలు అమెరికాలోని రోడ్లపైకి పాదయాత్రకు వచ్చారు. అబార్షన్ హక్కు కల్పించాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

Abortion Rights: అబార్షన్ హక్కుల కోసం మహిళల పాదయాత్ర

Abortion Right

Abortion Rights: పదివేల మందికి పైగా మహిళలు అమెరికాలోని రోడ్లపైకి పాదయాత్రకు వచ్చారు. అబార్షన్ హక్కు కల్పించాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీని కంటే ఒక రోజు ముందే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అబార్షన్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలంటూ ఫెడరల్ జడ్జిని ఆదేశించారు. ఫలితంగా సెప్టెంబర్ లో టెక్నాస్ వ్యాప్తంగా బోలెడు అబార్షన్లు నిషేదించారు అధికారులు.

ఈ రూల్స్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని మహిళలు పాదయాత్ర చేశారు.

వైట్ హౌజ్ కు సమీపంలో చేపట్టిన పాదయాత్రలో పదివేల మందికి పైగా పాల్గొన్నారు. అబార్షన్ చేసుకున్నవాళ్లంటే ఇష్టం, అబార్షన్ అనేది పర్సనల్ ఛాయీస్, ఇది లీగల్ డిబేట్ కాదు అంటూ ప్లకార్డులతో కనిపించారు. చాలా మంది అమెరికా సుప్రీం కోర్టు లేట్ జస్టిస్ రూత్ బ్యాడర్ గిన్స్‌బర్గ్ పోలిన దుస్తుల్లో కనిపించారు.

క్షమాపణలు అడగకుండా అబార్షన్ చేసుకునేందుకు వీలుండాలి. తిరుగుబాటు ఒక్కటే దీనికి మార్గం. అంటూ నినాదాలు చేయగా.. మొత్తం అబార్షన్ హక్కుల కోసం దేశవ్యాప్తంగా 660చోట్ల ఆందోళనలు జరిగాయి.