Gmail Youtube End : అలర్ట్.. ఈ స్మార్ట్ ఫోన్లలో ఇక జీమెయిల్‌, యూట్యూబ్‌ పనిచేయవు

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వెర్షన్ కలిగి ఉన్నారా? అయితే మీకో అలర్ట్. ఇకపై మీ ఫోన్ లో జీమెయిల్, యూట్యాబ్..

Gmail Youtube End : అలర్ట్.. ఈ స్మార్ట్ ఫోన్లలో ఇక జీమెయిల్‌, యూట్యూబ్‌ పనిచేయవు

Gmail Youtube End

Updated On : July 31, 2021 / 11:22 PM IST

Gmail Youtube End : మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వెర్షన్ కలిగి ఉన్నారా? అయితే మీకో అలర్ట్. ఇకపై మీ ఫోన్ లో జీమెయిల్, యూట్యాబ్ పని చేయవు. అవును.. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లపై గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వెర్షన్‌ను కలిగున్న ఆండ్రాయిడ్‌ ఫోన్లకు గూగుల్‌ అకౌంట్లలోకి సైన్‌ ఇన్‌ అవ్వకుండా మద్దతును గూగుల్‌ ఉపసంహరించుకోనుంది. 2.3.7 వర్షన్‌ లేదా అంతకంటే తక్కువ వర్షన్‌తో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సైన్ ఇన్‌లకు గూగుల్‌ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. సెప్టెంబర్ 27 నుంచి ఇది అమలు కానుంది.

2.3.7 కంటే తక్కువ వెర్షన్ వాడుతున్న యూజర్లకు గూగుల్‌ ఈ-మెయిల్‌ పంపింది. 2.3.7 వెర్షన్‌ను వాడుతున్న యూజర్లను కనీసం ఆండ్రాయిడ్‌ 3.0 హనీకోంబ్‌ వోఎస్‌కు తమ స్మార్ట్‌ఫోన్లను ఆప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఒక వేళ అప్‌డేట్‌ చేయకపోతే జీమెయిల్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ డ్రైవ్‌, యూట్యూబ్‌, ఇతర గూగుల్‌ సేవలను యాప్‌ల ద్వారా పొందలేరంది. వీటిని ఫోన్‌ బ్రౌజర్ లో యూజర్లు పొందే అవకాశం ఉన్నట్లు గూగుల్‌ తెలిపింది.

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్‌ 3.0 వర్షన్‌ దాని కంటే తక్కువ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వెర్షన్‌ అతి తక్కువమంది యూజర్లు వాడుతున్నారని గూగుల్‌ తెలిపింది. యూజర్ల భద్రత, డేటాను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.