15 విమానాలు.. టీడీపీ, వైసీపీ ఎంపీలకు ఆహ్వానాలు : దుబాయ్‌లో బీజేపీ నేత కుమారుడి నిశ్చితార్ధం

ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి.. అంగరంగ వైభవంగా చేసిన పెళ్లి వేడుకలు చూశాం. అంబానీ, గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో అలా

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 10:25 AM IST
15 విమానాలు.. టీడీపీ, వైసీపీ ఎంపీలకు ఆహ్వానాలు : దుబాయ్‌లో బీజేపీ నేత కుమారుడి నిశ్చితార్ధం

ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి.. అంగరంగ వైభవంగా చేసిన పెళ్లి వేడుకలు చూశాం. అంబానీ, గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో అలా

ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి.. అంగరంగ వైభవంగా చేసిన పెళ్లి వేడుకలు చూశాం. అంబానీ, గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో అలా జరిగినవే. ఇప్పుడు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఇంట జరుగుతున్న వేడుక గురించి అలాగే మాట్లాడుకుంటున్నారు. సీఎం రమేశ్‌ కుమారుడు రిత్విక్‌ నిశ్చితార్ధం దుబాయ్‌లో అట్టహాసంగా జరుగుతోంది. నిశ్చితార్ధానికి చేసిన ఏర్పాట్లు చూసి.. అంతా ఔరా అనుకుంటున్నారు. 

సీఎం రమేష్ కుమారుడు రిత్విక్‌తో పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజా నిశ్చితార్ధం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ వేడుక కోసం దుబాయ్‌లోని వాల్డార్ఫ్‌ అస్టోరియా హోటల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దేశంలోని పలువురు ఎంపీలతో పాటు అతిరధ మహారధులను ఆహ్వానించారు. టీడీపీతో పాటు వైసీపీ ఎంపీలకూ ఆహ్వానాలు అందాయి. కొంతమంది ప్రముఖులు ముందుగానే దుబాయ్ చేరుకుని సీఎం రమేష్ అతిథ్యంలో మునిగిపోయారు. 

సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్ధానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీలోని అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు ఢిల్లీలో బీజేపీ నేతలను పేరు పేరునా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అతిథులు దుబాయ్ చేరుకోవటానికి ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేసారు. అతిథులకు స్వాగతం పలికేందుకు దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌ వరకు తీసుకెళ్లడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసారు. నిశ్చితార్ధం బాధ్యతలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు.