Israeli Drone Guard: ఇజ్రాయెలి ELI-4030 డ్రోన్ గార్డ్‌ను ఇండియా కొనుగోలు చేసిందా..
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)కు చెందిన డ్రోన్ గార్డ్ కౌంటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (C-UAS)ను దక్షిణాసియా దేశానికి విక్రయించినట్లు ప్రకటించింది. ఇండియాలోని జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన నమోదైంది.

Drone Guard
Israeli Drone Guard: ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)కు చెందిన డ్రోన్ గార్డ్ కౌంటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (C-UAS)ను దక్షిణాసియా దేశానికి విక్రయించినట్లు ప్రకటించింది. ఇండియాలోని జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన నమోదైంది.
ఆ డ్రోన్ లో జీపీఎస్ అడ్జస్ట్ చేసి ఉంది. అంతేకాకుండా ఐఏఎఫ్ స్టేషన్ వద్ద జూన్ 27న ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ లను జారవిడిచినట్లు తెలిసింది. ఫలితంగా ఇద్దరు వ్యక్తులకు మైనర్ గాయాలవడంతో పాటు చిన్నపాటి డ్యామేజ్ అయిందని సమాచారం. ఇండియన్ మిలటరీ ఇన్‌స్టాలేషన్‌లో ఇది తొలి డ్రోన్ అటాక్.
జమ్మూ అండ్ కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాఘ్ సింగ్ జూన్ 27న జరిగిన ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. ఈ దాడిపై పాకిస్తాన్ టెర్రరిస్టుల పాత్ర ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది.
డిఫెన్స్ పోర్టల్ జాన్స్ కథనం ప్రకారం.. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) జులై 2న డ్రోన్ గార్డును విక్రయించినట్లు తెలిపింది. కస్టమర్ వివరాలను మాత్రం రివీల్ చేయలేదు. చాలా తక్కువ పరిమాణంలో ఉండి లైట్ వెయిట్ తో ఉండే డ్రోన్లను కూడా డ్రోన్ గార్డ్ వెంటనే పసిగట్టేయగలదని అధికార ప్రతినిధి వెల్లడించారు.
డ్రోన్ గార్డు నిర్మాణం పలు లేయర్ల సెన్సార్లతో ఉంటుంది. ఒక్కో లేయర్ ఒక్కొక్క ప్రత్యేక నిర్మాణంతో కూడి టార్గెట్ ను వెంటనే ఐడెంటిఫై చేస్తుంది.