హెల్త్ ’టెన్‘ షన్ : WHO చర్యలు

ఢిల్లీ : మానవ మేధస్సుతో రూపొందించిన టెక్నాలజీలో రోజు రోజుకు డెవలప్ అవుతోంది. దీర్ఘకాలిక రోగాలకు కూడా ట్రీట్ మెంట్ అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. జీవనశైలిలో అనుహ్యంగా చోటుచేసుకుంటున్న మార్పులు..ఆహార అలవాట్లు..వెరసి ప్రతీ మనిషికి ఏదోక ఆరోగ్యం సమస్యలు వస్తునేవున్నాయి. ప్రాణాంతక రోగాలూ పెరిగిపోతున్నాయ్. ఈ క్రమంలోనే మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చర్యలు తీసుకుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 300కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ కోసం ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా..సార్వత్రిక ఆరోగ్య పథకాల కింద 100 కోట్ల మంది లబ్ధి పొందేలా ఈ ప్లాన్ చేసింది. ఎమర్జన్సీ ట్రీట్ మెంట్ అందించటం ద్వారా మరో 100 కోట్ల మందిని కాపాడటం..100 కోట్ల మంది ఆరోగ్యంతో వుండేలా చేయటమే ఈ ప్లానింగ్ టార్గెట్. ఈ క్రమంలో 2019లో ముఖ్యంగా 10 ఆరోగ్య సమస్యలను గుర్తించాల్సిన బాధ్యత డబ్ల్యూహెచ్‌వోతోపాటుగా ఎన్జీవోలు కూడా తీసుకోవాల్సి వుంది.
వాతావరణలో మార్పులు..గాలి కాలుష్యం
వాయు కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారనీ..మరో 100కోట్లమందికి పైగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని అధికారికంగా వెల్లడయ్యింది. వాయు కాలుష్యం ‘సరికొత్త పొగాకు అంటు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడాస్ అధన్మన్ పేర్కొన్నారు.
కనీస వైద్య సదుపాయం ప్రజల హక్కు
భారత్ లో పలు ప్రాంతాలలో కనీస ఆరోగ్య సంరక్షణ ఫెసిలిటీస్ కూడా లేకపోవటం బాధాకరమని ఇండియా స్పెండ్ నివేదిక తెలిపింది. కనీస వైద్య సదుపాయం అనేది ప్రజల ప్రాథమిక హక్కు 40 ఏళ్ల క్రితమే 1978 నాటి ‘అల్మా–అటా డిక్లరేషన్’ ప్రకటించింది. 2018 అక్టోబర్ 26న ఈ డిక్లరేషన్‌ను పునరుద్ఘాటిస్తూ 197 దేశాలు సంతకాలు చేశాయి. ఆరోగ్య సంరక్షణ సాధిస్తామని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పటిష్టం చేస్తామని ఈ 197 దేశాలు ప్రతిజ్న చేశాయి. కానీ అది ఇంతవరకూ నెరవేర్చిన దాఖలాలు లేవు.
3 ఫ్లూ వైరస్ విజృంభణ
ఫ్లూ వైరస్ చాలా ప్రమాదకమైనది. ఇది మనిషిపై ఎప్పుడు దాడి చేస్తుందో కనీసం అంచానా కూడా వేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ వ్యాధి వైరస్ ను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు డబ్ల్యూహెచ్‌వో పలు దేశాలతో కలిసి జాయింట్ ప్రోగ్రామ్ ను చేపట్టింది.
4 అందని ద్రాక్షగా ఆరోగ్య ఫెసిలిటీస్
ప్రపంచ జనాభాలో 22% మంది సరైన వైద్యసదుపాయాలు అందని ప్రాంతాల్లో నివసిస్తున్నారని..వీరికి కనీస హెల్త్ సేఫ్టీ కూడా అందడం లేదని..కరువు..దేశంలో నెలకొన్ని కొన్ని పరిస్ధితుల కారణంగా కనీస ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారని..దీంతో వారు పలు వ్యాధులబారిన పడుతున్నారనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
5 పనిచేయని యాంటీబయోటిక్స్..వినియోగంలో భారత్ ఫస్ట్ ప్లేస్
పలు రోగాలు వస్తే తట్టుకునేందుకు వినియోగించే యాంటీబయోటిక్స్ ను ఎక్కువ డోస్ తో వాడటం వల్ల కొంత కాలానికి రోగ కారక క్రిములు యాంటీబయోటిక్స్ కు కూడా తట్టుకుని మరింత వ్యాధులకు కారవాటిని తట్టుకునే శక్తిని సంపాదించుకుంటాయి. ప్రపంచంలో యాంటీబయోటిక్‌లను దుర్వినియోగం చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2000–2015 మధ్య కాలంలో భారత్‌లో యాంటీబయోటిక్‌ల వినియోగం 103% పెరిగిందని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (పీఎన్‌ఏఎస్) నివేదిక వెల్లడించింది. భారత్ లో పలు మెడిసిన్స్ తట్టుకునే బ్యాక్టీరియా విస్తరిస్తోందని పీఎన్‌ఏఎస్ వెల్లడించింది.
6 ఎబోలాకు బలైపోయిన 426మంది
2018 నవంబర్‌లో కాంగోలో ఎబోలా వ్యాధికి 426 మంది బలైపోయారు. కాంగోకు ఎబోలా ముప్పు పొంచి ఉందని 2018 మేలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసే ఎబోలా వంటి వ్యాధులను డబ్ల్యూహెచ్‌వో ముందే గుర్తించి హెచ్చరిస్తోంది.
7 అంటువ్యాధులు కాని రోగాలతో కోట్లాదిమంది మృతి
అంటువ్యాధులు కానివి వ్యాధులకు కూడా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది గురవుతున్నారు. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకూ ఏ వయసులోనైనా ఈ వ్యాధులు రావచ్చునని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. గుండె జబ్బులు, కేన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక అనారోగ్యం వంటివి వ్యాధులు ఇటువంటివే. కోవలోకి వస్తాయి. వీటివల్ల ఏటా 4.1 కోట్ల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే మరణాల్లో 71% వాటా ఈ వ్యాధులదేనని ఆ నివేదిక తెలిపింది.
8. 10 కోట్ల మంది డెంగ్యూ..తగ్గించేందుకు యత్నాలు
ప్రపంచ జనాభాలో సగానికిపైగా డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉందని…ఏటా 5 నుంచి 10 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 2020 నాటికి డెంగ్యూ మరణాలను 50% తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఓ వ్యూహాన్ని అమలుపరుస్తోంది.
9 హెచ్‌ఐవీ :
హెచ్‌ఐవీ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలటో 2030 నాటికి ఎయిడ్స్ రహిత ప్రపంచంగా అన్ని దేశాలు కృషిచేస్తున్నాయని యునిసెఫ్ 2018లో తెలిపింది. 2018–2030 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 3.6 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణించే అవకాశం ఉందని..తగిన నివారణ చర్యలు తీసుకుంటే ఏటా 20 లక్షల మందిని ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చని ఆరోగ్య సంస్థ తెలిపింది.
10 టీకాలు : అపోహలు..అర్థం లేని భయాలు
పలు వ్యాధులను నియంత్రించేందుకు..నివారించేందుకు ముందస్తుగా టీకాలు వేయడం సర్వసాధారణంగా జరిగేదే. కానీ ఈ టీకాలపై ఈనాటికి పలు అపోహలు, భయాలు వెన్నాడుతున్నాయి. దీంతో టీకాలు వేయించుకోవడానికి పలు ప్రాంతాల వారు వెనుకాడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. టీకాల ద్వారా ఏటా 20–30 లక్షల మరణాలను నివారించవచ్చని..2019లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెర్వికల్ కేన్సర్‌ను రూపుమాపాలని డబ్ల్యూహెచ్‌వో ప్లాన్స్ వేస్తోంది.