బైటపడ్డ ఇనప్పెట్టెలో 180 ఏళ్లనాటి మేయర్ ‘గుండె’ పదిలం

  • Publish Date - September 2, 2020 / 04:56 PM IST

ఎప్పుడో 180 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి గుండె ఇంకా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇది చాలా వింత విచిత్రం..ఆశ్చర్యంకలిగించే విషయం బెల్జియంలో బైటపడింది. 180 ఏళ్ళ నాటి గుండె బయటపడింది. అది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడం గమనార్హం.



బెల్జియంలోని వెర్వర్స్ నగరంలో ఓ ఫౌంటెయిన్ ఉంది. ఆ ఫౌంటెన్ పేరు పియరీ డేవిడ్. ఆ ఫౌంటెన్ లో భద్రపరిచిన ఓ ఇనప్పెట్టెలో వెర్వర్స్ నగరానికి మొట్టమొదటి మేయర్‌గా పనిచేసిన పియరీ డేవిడ్‌ గుండెను భద్రపరచారు. 1800-1808 మధ్యకాలంలో ఆయన వెర్వెర్స్‌ నగరానికి మేయర్‌గా పని చేశారు. ఒక జింక్ పెట్టెలో ఓ కూజాను పెట్టి ఆ కూజాలో ఆల్కహాల్ పోసి అందులో పియరీ డేవిడ్ గుండెను భద్రపరిచారు. ఆ తరువాత దశాబ్దాలేకాదు..శతాబ్దం కూడా దాటిపోయింది. ఇటీవల ఆ ఫౌంటెన్‌ను రిపేర్‌ చేస్తుండగా ఈ ఇనప్పెట్టె బైటపడింది. ఆ పెట్టెను ప్రస్తుతం ఈ పెట్టెను ఫైన్‌ ఆర్ట్స్ మ్యూజియంలో ఉంచారు.



మేయర్‌ పియరీ డేవిడ్‌ 1839 లో పియరీ డేవిడ్ తన 68వ ఏట మరణించారు. 1883 జూన్‌ 25లో ప్రారంభించిన ఈ ఫౌంటెయిన్‌కు ఆయన పేరు పెట్టారు. పియరీ గుండెను ఫౌంటెయిన్‌ మధ్యలో దాచి ఉంచుతున్నట్లు ఆ పెట్టె మీద రాసి ఉంచారు. గుండెను దాయడంపై స్థానికంగా ప్రచారంలో ఎన్నో కథలు కూడా ఉన్నాయి.





పియరీ కుటుంబసభ్యుల అనుమతితోనే ఆయన గుండెను ఫౌంటెయిన్ లో ఉంచారని తెలుస్తోంది. 1830 వరకు బెల్జియం ఫ్రాన్స్ పాలనలో ఉండేది. 1830లో బెల్జియం స్వాతంత్ర్యం పొందాక వెర్వెర్స్ నగరానికి పియరీ డేవిడ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఫ్రాన్స్‌ స్వేచ్ఛా విధానాలను, ఫ్రెంచ్‌ విప్లవాన్ని ఎంతో ఇష్టపడే డేవిడ్‌ 1815 నుంచి 1830 వరకు డచ్‌ పాలనలో గడిపారు. 1830 నాటి ఉద్యమంలో వెర్వెర్స్‌ నగరం తీవ్రంగా ధ్వంసం అయింది.





అప్పుడు దానిని బాగు చేసే బాధ్యతలు పియరీ డేవిడ్‌ తీసుకున్నారు. అలా మేయర్‌ పియరీ డేవిడ్‌ 1839 లో పియరీ డేవిడ్ తన 68వ ఏట మరణించగా ఆపేరుతో నిర్మించిన ఆ ఫౌంటెన్ లో ఓ బాక్సులో ఆయన గుండెను భద్రపరిచారు. ఇన్నేళ్లకు ఆ ఫౌంటన్ రిపేర్ చేస్తుండగా ఆ బాక్స్ బైటపడింది..ఆనాటినుంచి ఈనాటి వరకూ ఆ బాక్సు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.