గాలి కూడా అందడం లేదు, కరోనా బాధితులతో కిక్కిరిసిన ఆసుపత్రులు, ఇటలీలో హృదయవిదారక దృశ్యాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు పాకింది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 07:29 AM IST
గాలి కూడా అందడం లేదు, కరోనా బాధితులతో కిక్కిరిసిన ఆసుపత్రులు, ఇటలీలో హృదయవిదారక దృశ్యాలు

Updated On : March 21, 2020 / 7:29 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు పాకింది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు పాకింది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అందులో 11వేల మంది చనిపోయారు. 7వేల మందికి సీరియస్ గా ఉంది. చైనాలో వెలుగుచూసిన కరోనా చైనా కంటే, ఇటలీలో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఇటలీలో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా మృతులు చైనాకంటే ఇటలీలోనే ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. 

ఇటలీలోని ఆసుపత్రుల్లో హృదయవిదారకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరోనా పేషెంట్లతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఏ బెడ్ మీద చూసినా కరోనా బాధితులే ఉన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కనీసం గాలి కూడా అందడం లేదు. ఊపిరి తీసుకోవడం కూడా పేషెంట్లకు ఇబ్బందిగా ఉంది. గాలి ఆడక బాధితులు నరకం చూస్తున్నారు. దీంతో వారికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి మరీ ఊపిరి అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటలీ ఆసుపత్రుల్లో కరోనా బాధితులు పడే కష్టాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారి అవస్థలు కళ్లారా చూస్తున్న నెటిజన్లు కంట తడి పెడుతున్నారు. అయ్యో పాపం అని జాలి చూపిస్తున్నారు. శత్రువుకి కూడా ఇలాంటి కష్టం, వేదన రాకూడదని వాపోతున్నారు.

See Also | కరోనా ఎఫెక్ట్: బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్.. ఉచితంగా హైస్పీడ్ ఇంటర్నెట్

కరోనా బాధితుల్లో చాలామంది వృద్ధులు ఉన్నారు. వారిలో కొందరు తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. తప్పని పరిస్థితుల్లో వారికి ఆక్సిజన్ గొట్టాలు అమర్చారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారిని పూడ్చేందుకు స్థలం లేకపోవడంతో.. ఏకంగా ప్రార్థనా మందిరాన్ని స్మశానంగా మార్చాల్సి వచ్చిందని అధికారులు వాపోయారు. దహన సంస్కారాలకు సైనిక ట్రక్కులను వినియోగిస్తున్నారు. ఇటాలియన్ల నిర్లక్ష్యమే వారి కొంప ముంచిందని, ఇంతటి ఘోరానికి దారి తీసిందని రెడ్ క్రాస్ బృందం ఆరోపించింది. నేషనల్ లాక్ డౌన్ విధించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.