అటవిలో కార్చిచ్చు..ఆర్పటానికి వెళ్లిన చాపర్ పైలెట్ సజీవదహనం

అడవిలో రాజుకున్న కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లిన ఓ చాపర్ పైలెట్ సజీవ దహనం అయ్యాడు. హెలికాప్టర్ కుప్ప కూలడంతో ప్రాణాలు వదిలిన దారుణ ఘటన కాలిఫోర్నియాలోని కౌంటీ ప్రాంత అడవుల్లో బుధవారం (ఆగస్టు 19,2020) చోటు చేసుకుంది. మంటలు ఆర్పేందుకు వెళ్లి ఇలా ప్రమాదబారిన పడటం విషాదకరమని అగ్నిమాపక రక్షణ శాఖ అధికారులు అన్నారు.
గత మూడు రోజులుగా శాన్ఫ్రాన్సిస్‌కోకు ఉత్తరాన వాకావిల్లే నాగరానికి సమీపంలో 46 వేల ఎకరాల్లో (18,615 హెక్టార్లు) విస్తీర్ణంలో ఉన్న పర్వతాల గుండా ఫ్రెస్నో కౌంటీలోని మంటలు వ్యాపించాయి. కార్చిచ్చు కారణంగా ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. దీంతో ప్రత్యేక హెలికాప్టర్లు మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ 50 కి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. 46 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిలో అగ్ని దావానంలా వ్యాపిస్తోంది. అగ్ని కీలలు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు అన్ని వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చాలా వన్యప్రాణులు చనిపోయాయని అధికారులు ప్రకటించారు.