హిట్లర్ ఇల్లు ఇక పోలీస్ స్టేషన్

  • Published By: madhu ,Published On : November 24, 2019 / 04:33 AM IST
హిట్లర్ ఇల్లు ఇక పోలీస్ స్టేషన్

Updated On : November 24, 2019 / 4:33 AM IST

అడాల్ఫ్ హిట్లర్..ప్రపంచాన్ని గడగడలాడించిన కొంతమంది నియంతల్లో ఈయన ఒకరు. నాజీ నేత ఇతను. ఈయన నివాసం ఉంటున్న ఇక నుంచి పోలీస్ స్టేషన్‌గా మారనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాయువ్య ఆస్ట్రియన్ పట్టణంలోని బ్రౌనౌ ఆమ్ ఇన్‌లో హిట్లర్ నివాసం ఉంది. ఈ భవనాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం 2017లో స్వాధీనం చేసుకుంది. ఈ ఇంటిని పరిరక్షించడం ప్రభుత్వానికి ఒక సవాల్‌గా మారింది.

ఆస్తిని స్వాధీనం చేసుకోవడాన్ని అక్కడి హోం శాఖ మంత్రి సమర్థించుకున్నారు. పోలీస్ స్టేషన్‌గా మార్చడం ద్వారా నియో నాజీలు స్మరించుకొనే ఛాన్స్ ఉండదని తెలిపారు. యాత్రా స్థలంగా భావిస్తున్న వారు ఇక రారని అనుకుంటున్నారు. ఆస్తిని స్వాధీనం చేసుకొనే విషక్షంలో చట్టపరమైన అడ్డంకులు తొలగించినప్పటికీ, ఇప్పట్లో ఈ భవనంలోకి వెళ్లబోమన్నారు. మరోవైపు బిల్డింగ్‌ను ఆధునీకరించేందుకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి పనులు స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిట్లర్ 1889లో జర్మన్ సరిహద్దులో ఉన్న బ్రౌనౌ ఆమ్ ఇన్‌‌లో జన్మించాడు. ఒకప్పుడు ఇందులో దివ్యాంగులకు డే కేర్ సెంటర్ నిర్వహించే వారు. వీల్ చెయిర్ ఫ్రెండ్లీగా మార్చాలన్న సెంటర్ నిర్వాహకుల ప్రయత్నాలను ఇంటి ఓనర్ అభ్యంతరం చెప్పడంతో కేంద్రాన్ని తరలించారు. అనంతరం 2014లో దీన్ని శరణార్థులకు ఆవాసంగా మార్చాలని అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు. 2016లో ప్రభుత్వం దీనిని 8 లక్షల 97 వేల డాలర్లకు కొనుగోలు చేసింది. కానీ..ఈ నివాసంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దీనిని కూల్చివేయాలని కొందరు..ధార్మిక కార్యకలాపాలకు ఉపయోగించాలని మరికొందరు వాదిస్తున్నారు. 
Read More : నేడే మహా రాజకీయంపై సుప్రీంకోర్టులో విచారణ