Pakistan : పాకిస్తాన్‌లో హోలీ వేడుకలు.. సందడి చేసిన క్వాయిడ్-ఐ-అజం యూనివర్సిటీ విద్యార్థులు
ఇండియాలో హోలీ వేడుకలు చాలారోజల క్రితం ముగిశాయి. అయితే పాకిస్తాన్‌లోని క్వాయిడ్-ఇ-అజామ్ యూనివర్సిటీ విద్యార్ధులు రీసెంట్‌గా హోలీ వేడుకలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Pakistan
Pakistan : ఇండియాలో హోలీ వేడుకలు చాలా రోజుల క్రితం జరిగాయి. కానీ పాకిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో హోలీ వేడుకలు నిర్వహించారు. స్టూడెంట్స్ సంబరంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
United Nations: పాకిస్థాన్ సహా ఆహార కొరతతో అల్లాడిపోనున్న దేశాలు ఇవే..
ఇస్లామాబాద్‌లోని క్వాయిడ్-ఐ-అజం విశ్వవిద్యాలయం విద్యార్థులు జూన్ 12న తమ క్యాంపస్‌లో హోలీ వేడుకలను నిర్వహించారు. యూనివర్సిటీకి చెందిన మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఈ కార్యక్రమం ప్రారంభించింది. గతంలో అంటే 2019 కూడా ఇలాగే హోలీ కార్యక్రమం నిర్వహించారు. తాాజగా జరిగిన కార్యక్రమంలోవేడుకలో విద్యార్ధులంతా సందడి చేశారు. రంగులు చల్లుకుని సంతోషాన్ని పంచుకున్నారు. @NewsQau ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేయడంతో అనేకమంది స్పందించారు.
దీనిపై అనేకమంది కామెంట్లు పెట్టారు. ‘బట్టలు శుభ్రం చేసే తల్లులకు తప్ప దక్షిణాసియాలో ప్రజలందరికీ ఇది గొప్ప సాంస్కృతిక పండుగ’ అని ఒకరు.. ‘కొన్ని రోజుల క్రితం హోలీ జరుపుకోవడానికి.. ఈరోజు ఇక్కడ హోలీ జరపడానికి కారణం ఉంది.. క్వాయిడ్-ఐ-అజం విశ్వవిద్యాలయం, మీ పేరుకు కట్టుబడి ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
అయితే క్వాయిడ్-ఐ-అజం యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఆమోదం లేకుండా ఇక్కడ ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించకూడదు. అలా ఎవరైనా చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఇదివరకే అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఈవెంట్‌కు అధికారులు ఆమోదం తెలిపారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Happy Holi ? ?
Biggest Holi celebrations at Quaid-i-Azam University Islamabad Pakistan ? pic.twitter.com/ZciVSyctuI— QAU News (@NewsQau) June 13, 2023