హాలీవుడ్ దంపతులకు కరోనా : మేం బాగానే ఉన్నాం.. ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాం

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 05:00 AM IST
హాలీవుడ్ దంపతులకు కరోనా : మేం బాగానే ఉన్నాం.. ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాం

Updated On : March 12, 2020 / 5:00 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సామాన్యుడు, సెల‌బ్రిటీ అనే బేధం లేకుండా అందరినీ గడగడలాడించేస్తోంది. హాలివుడ్ ప్రముఖ సినీనటుడు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్‌లకు కరోనా వైరస్ సోకిందని వైద్యపరీక్షల్లో తేలింది.  ప్రఖ్యాత అమెరికన్ singer Elvis Presley జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కోసం ఈ భార్యాభర్తలు ఆస్ట్రేలియా వచ్చారు.

ఈ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలోని  Gold Coast నగరంలో జరుగుతోంది. ఈ షూటింగ్లో ఉన్న టామ్ హంక్స్ దంపతులు బుధవారం (మార్చి 11,2020)న బ్లడ్ టెస్ట్ లు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో  టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులను ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దీనిపై టామ్ హంక్స్ దంపతులు మాట్లాడుతూ..‘‘ కొన్ని రోజులుగా మాకు నీరసంగా ఉంది..జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నాం…దీంతో కరోనా వచ్చిందేమోనని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన వెంటనే హాస్పిటల్ కు వచ్చి టెస్ట్ లు చేయించుకోగా..పాజిటివ్ వచ్చిందని తెలిపారు. 

ఈ విషయాన్ని టామ్ హంక్స్, రీటా విల్సన్ లిద్దరూ త‌మ‌కి క‌రోనా సోకిన విష‌యాన్ని టామ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. డ‌స్ట్‌బిన్‌లో ప‌డేసిన  స‌ర్జిక‌ల్ గ్లోవ్ ఫోటోని షేర్ చేస్తూ ఈ హాలీవుడ్ యాక్ట‌ర్ విష‌యాన్ని తెలిపాడు. ఈ భార్యాభర్తలు ఇద్దరి వయను 63 ఏళ్లు. ఇప్పుడు తాము ఇద్దరం ఇతరులు ఎవ్వరితో కలవకుండా వేరుగా ఉంటున్నట్టు టామ్ హ్యాక్స్ తెలిపారు. తమ ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తామని..ప్రజారోగ్యం, భద్రత కోసం అవసరమైనన్ని రోజులు మేం పరీక్షలు చేయించుకుని, వైద్యుల పర్యవేక్షణలో ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉంటామని తెలిపారు. 

ఉత్తమ నటుడిగా రెండు సార్లు ఆస్కార్ అవార్డు పొందిన టామ్ హ్యాంక్స్ మరో ఆరు సార్లు ఆస్కార్ అవార్డు కోసం పోటీపడ్డారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు పొందారు. అలాగే, ఆయన నటించిన Forrest Gump and Saving Private Ryanలాంటి సినిమాలు ఆస్కార్ అవార్డులు పొందాయి.

కాగా..టామ్ హ్యాంక్స్ నటిస్తున్న తాజా చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ Warner Bros ఈ అంశంపై స్పందిస్తూ.. ‘‘మా కంపెనీ సభ్యుల ఆరోగ్యం, భద్రత మాకు చాలా ముఖ్యమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ తరపున పనిచేస్తున్న అందరినీ రక్షించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ప్రకటించింది.

ఆస్ట్రేలియాకు చెందిన దర్శకుడు Baz Luhrmann దర్శకత్వం వహిస్తున్న, ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిందని స్థానిక మీడియా తెలిపింది.టామ్ హ్యాంక్స్ భార్య రీటా విల్సన్ కూడా నటి, గాయకురాలు. గత వారం బ్రిస్బేన్ ఎంపోరియం హోటల్, సిడ్నీ ఒపెరా హౌస్‌ల్లో జరిగిన ప్రదర్శనల్లో ఆమె పాల్గొన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియాలో 136 క‌రోనా కేసులు నమోదవుగా..ముగ్గురు చనిపోయారు. క‌రోనాని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం  పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 

See Also | ప్రపంచంలోనే అంత్యంత అరుదైన రెండు తెల్లజిరాఫీలను హతమార్చిన వేటగాళ్లు..ఇక అవి అంతరించిపోయినట్లే!!