×
Ad

Hong Kong Flight : పేలిన హాంకాంగ్ విమానం టైరు..11 మంది ప్రయాణికులకు గాయాలు

సాంకేతిక లోపంతో టేకాఫ్ నిలిపివేసిన హాంకాంగ్ విమానం టైర్ పేలి 11 మంది విమాన ప్రయాణికులు గాయపడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాథీ పసిఫిక్ సీఎక్స్ 880 విమానం లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. హాంకాంగ్ విమానం టేకాఫ్ అయ్యాక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే విమానాన్ని నిలిపివేశారు.

  • Published On : June 25, 2023 / 06:46 AM IST

Hong Kong Flight Tyre Burst

Hong Kong Flight : సాంకేతిక లోపంతో టేకాఫ్ నిలిపివేసిన హాంకాంగ్ విమానం టైర్ పేలి 11 మంది విమాన ప్రయాణికులు గాయపడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.  హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాథీ పసిఫిక్ సీఎక్స్ 880 విమానం లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. హాంకాంగ్ విమానం టేకాఫ్ అయ్యాక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే విమానాన్ని నిలిపివేశారు.

Russia : మాస్కో మార్చ్ నిలిపివేత, వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై చర్యల ఉపసంహరణ

ఈ కాథీ పసిఫిక్ విమానంలో 17 మంది సిబ్బంది, 293 మంది ప్రయాణికులున్నారు. విమానం నుంచి ప్రయాణికులు దిగుతుండగా విమానం టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విమానం టైరు వేడెక్కడం వల్ల పేలిందని హాంకాంగ్ పోలీసులు చెప్పారు.

PM Modi in Egypt : భారత్‌తో వాణిజ్య సంబంధాలపై ఈజిప్టు ప్రధాని,మంత్రులతో మోదీ చర్చలు

గాయపడిన 11 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించారు. వారిలో 9 మంది ప్రయాణికులను డిశ్చార్జ్ చేశామని విమానాశ్రయ అధికారులు చెప్పారు. గాయపడిన ప్రయాణికులకు విమానయాన సంస్థ సహాయం అందించింది. విమాన ప్రయాణికులకు ఈ ప్రమాదం వల్ల అసౌకర్యం కలిగినందుకు కాథే విమాన సంస్థ క్షమాపణలు చెప్పింది.