Hospital Amputates Wrong Leg : ఒక కాలి సమస్యకు మరో కాలు తొలగించిన డాక్టర్లు

డాక్టర్లు చేసిన తప్పిదానికి అకారణంగా కాలు పోగొట్టుకున్నాడో పేషెంట్. వయస్సు రీత్యా పెద్ద వాడైన ఓ వ్యక్తి ఫ్రిస్టాడ్ క్లినిక్ లో జాయిన్ అయ్యాడు. చాలా అనారోగ్యంతో బాధ...

Doctors Removed Leg

Tragic Mistake: డాక్టర్లు చేసిన తప్పిదానికి అకారణంగా కాలు పోగొట్టుకున్నాడో పేషెంట్. వయస్సు రీత్యా పెద్ద వాడైన ఓ వ్యక్తి ఫ్రిస్టాడ్ క్లినిక్ లో జాయిన్ అయ్యాడు. చాలా అనారోగ్యంతో బాధపడుతున్నానని ట్రీట్మెంట్ అందించాలని అడిగాడు. గతంలో ఓ సారి ఇలాగే జబ్బు చేసి కాళ్లకు ఇన్ఫెక్షన్ పాకింది. దాంతో అతని ఎడమ కాలు తొలగించాలని డాక్టర్లు చెప్పారు.

‘మంగళవారం మే 18న మేం షాక్ అయ్యాం. స్టాండర్డ్స్ ప్రకారం.. ఆ 82ఏళ్ల వ్యక్తి వేరే కాలు తీసినట్లుగా గుర్తించాం. గురువారం ఉదయం పేషెంట్ బ్యాండేజి మార్చుతుంటే ఆ తప్పు తెలిసింది. పొరబాటున జరిగిన ఫెయిల్యూర్ అనుకుంటున్నాం. పబ్లిక్ గా దీనికి క్షమాపణ చెప్తున్నాం అని క్లినిక్ మెడికల్ డైరక్టర్ నార్బర్ట్ వెల్లడించారు.

అతని అనారోగ్యం కారణంగా ఆ పేషెంట్ సమస్యను ముందుగా గుర్తించలేకపోయాడు. ఇతరులు చెప్పిన తర్వాతే సంగతి తెలుసుకున్నాడు. సర్జరీకి ముందు మార్క్ చేయడంలో తప్పు జరిగి ఉండొచ్చని వైద్యులు అంటున్నారు.

దురదృష్టవశాత్తు ఎడమ కాలికి బదులు కుడి కాలు తీసేశాం. ఆ తప్పు ఎలా జరిగిందో తెలుసుకుంటాం. అతనికి ప్రస్తుతం సైకలాజికల్ అసిస్టెన్స్ అవసరం. ప్రస్తుతం అతనికి మరోసారి సర్జరీ చేసి సమస్య ఉన్న కాలిని తొలగించాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.