కరోనాను కట్టడి చేయడం చైనాకు ఎలా సాధ్యపడింది..?

అత్యంత భీకరంగా దాడి చేసిన కరోనా వైరస్ ను చైనా ఎలా ఎదుర్కొంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాను కట్టడం చేయడం చైనాకు ఎలా సాధ్యపడింది..?

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 12:48 AM IST
కరోనాను కట్టడి చేయడం చైనాకు ఎలా సాధ్యపడింది..?

Updated On : March 29, 2020 / 12:48 AM IST

అత్యంత భీకరంగా దాడి చేసిన కరోనా వైరస్ ను చైనా ఎలా ఎదుర్కొంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాను కట్టడం చేయడం చైనాకు ఎలా సాధ్యపడింది..?

అత్యంత భీకరంగా దాడి చేసిన కరోనా వైరస్ ను చైనా ఎలా ఎదుర్కొంది…ఇదే ప్రశ్న అన్ని దేశాలనూ వేధిస్తోందిప్పుడు… ఎందుకంటే 81వేల కేసులున్న చైనాలో..ఇప్పుడు కొత్త కేసులు పదుల సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయ్.. ఇదే సమయంలో ఇతర దేశాల్లోనేమో..వేలల్లో నమోదు అవుతున్నాయ్.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న  కరోనాను కట్టడం చేయడం చైనాకు ఎలా సాధ్యపడింది..?

కరోనాని కట్టడి చేసేదెలా….ఈ ప్రశ్న రాని దేశం..పౌరుడు ఉండడు… అంతగా మనిషి జీవితాన్ని ఇప్పుడు కరోనా ప్రభావితం చేస్తోంది..ప్రపంచానికి ప్రపంచమే తాళం వేసుకుని ఇళ్లలో కూర్చున్న అరుదైన సన్ని వేశం ఇది.. ఐతే లాక్‌డౌన్ చేసుకోవడంతో వచ్చే కష్టాలు కూడా తక్కువేం కాదు.. నిత్యావసరాలు దొరకవేమో అన్న భయం..ఉపాధి కోల్పోయిన కోట్లాదిమంది జనం..ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితం చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు..ఇలాంటి సమయంలోనే చైనా ఈ  గడ్డు పరిస్థితిని ఎలా అధిగమించిందో చూడాలి…

వుహాన్ సిటీని లాక్ చేసిన తర్వాత చైనా అక్కడి ప్రజలకు ఇంటికే నిత్యావసరాలను పంపించింది. దీంతో బైటికి వచ్చే అవసరం దాదాపు తగ్గిపోయింది..ఒక్క వుహాన్‌కే కాదు..దేశం మొత్తం కూడా ఇదే పద్దతి ఫాలో అయింది..ప్రతి విషయంలో పూలింగ్‌కి అలవాటు పడిన చైనాలో హోమ్ డెలివరీ అనేది పెద్ద సమస్య కానే కాలేదు.. కానీ మన దేశానికి వచ్చేసరికి ఇది ఎక్కడిక్కడ స్థానిక ప్రభుత్వాల సమన్వయంతో కుదురుతుందేమో కానీ..అన్ని చోట్లా సక్సెస్ అవుతుందని మాత్రం చెప్పలేం… 

ఆటోమేషన్‌ని ఉపయోగించి చైనా… డ్రోన్ల ద్వారా కూడా నిత్యావసరాల సరఫరా చేయగలిగింది..దీంతో మనుషులతో కాంటాక్ట్ అవకుండానే సరుకులు దాదాపు ప్రజలకు చేరగలిగాయ్..భారత్‌లో ఈ మేర సదుపాయలు ఉంటాయా అంటే సందేహమే..రెస్టారెంట్లలో సర్వింగ్ కోసం రోబోలను చూశామే తప్ప..సరుకుల సరఫరాలో మాత్రం లేవు..అలానే ప్రతి చిన్న వెండర్ ఆన్‌లైన్‌లో తమ కస్టమర్లనుంచి ఆర్డర్లు తీసుకోవడం చైనాలో సాధ్యపడింది. మన దేశంలో పెద్ద పెద్ద ఈ కామర్స్ సంస్థలకే ఈ అవకాశం ఉంది. ఇతర లోకల్ ట్రేడర్లు ఈ పద్దతిని అందిపుచ్చుకుంటే సోషల్ డిస్టెన్సింగ్ సమస్యని అధిగమించవచ్చు….అలానే చైనాలో క్వారంటైన్‌నుంచి బైటికి వచ్చేవారిని కనిపెట్టడానికి డ్రోన్లు వాడారు.

వుహాన్ వుచాంగ్ హాస్పటల్‌లో పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌లో రోబోటిక్ అసిస్టెంట్ కూడా వాడారు..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పని చేసే థర్మామీటర్లను స్టాఫ్‌కి కూడా తప్పనిసరి చేసారు. వుహాన్‌లోనే 20వేల పడకలతో ఏర్పాటు చేసిన స్మార్ట్ ఫీల్డ్ హాస్పటల్ రోబోలతోనే పేషెంట్లకు ఫుడ్ సర్వ్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం చేసారు..పేషెంట్లకు ఎంటర్ టైన్ మెంట్ కోసం డ్యాన్సులు కూడా ఈ రోబోలు చేశాయంటే ఆశ్చర్యం అన్పించవచ్చు..పేషెంట్లకు సేవలు చేసేటప్పుడు స్టాఫ్‌కి వైరస్ సోకే ప్రమాద ఉంది..కానీ ఈ రోబోలకు వైరస్ సోకదనే ఐడియానే చైనా మార్క్ స్పెషాల్టీ. ఐతే మార్కెట్లలో బారులు తీరిన కస్టమర్లను ఒకరికి ఒకరు దూరంగా మెలగమని చెప్పడం భారత్‌లో  వృధా ప్రయాస అవుతుంది..కానీ పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ విషయంలో తానే కోల్‌కతా మార్కెట్లలో రంగంలోకి దిగి అదెలా ఫాలో అవ్వాలో చెప్పడం అభినందనీయం..ఇలా చేయడంతోనే సామాజిక దూరం పాటించాలనే విషయం అందరికీ చేరుతుంది..

కరోనాని కట్టడి చేసే విషయంలో ప్రాథమికంగా చైనా సక్సెస్ అయింది..మొదట్లో ఇక్కడ కూడా కరోనా వైరస్ 40శాతం జనాభాని తాకుతుందని అంచనాలున్నాయ్. ఇక్కడ లాక్ డౌన్ విధించకముందు..చైనాలో ప్రతి వ్యక్తీ ఇద్దరికంటే ఎక్కువమందికి వైరస్ ని వ్యాప్తి చేస్తాడని అంచనా వేసారు.. అయితే   జనవరి 16 నుంచి జనవరి 30 మధ్యలోని ఏడు రోజుల్లోనే ఈ వ్యాధి సంక్రమణ తీవ్రత దాదాపు ఒకరి నుంచి ఒకరికే పరిమితమైంది..ఇక్కడ లాక్ డౌన్ జనవరి 23న ప్రకటించారు..ఐతే భారత్‌లోలానే చైనాకీ మరో పోలిక ఉంది..చైనాలో కూడా భారత్‌లానే ఎక్కువ మందిని  టెస్ట్ చేయలేదు. వైరస్ సోకిన లక్షణాలు కన్పించకపోవడం అనేది కూడా రెండో కారణం కావచ్చంటారు.

ఇదే స్థితి ఇప్పుడు భారత్‌లో ఉంది..కారణాలేమైనా చైనాలో కొత్త కేసులు తగ్గిపోయాయ్..ఐతే ఇక్కడే మరో ప్రమాదం పొంచి ఉంది..ఎప్పుడైతే చైనాలో పరిస్థితి చక్కబడిందని భావిస్తున్నారో వైరస్ రీ అక్కరెన్స్..అంటే తిరిగి పేషెంట్లకు సోకడం కన్పిస్తోంది..కరోనా వైరస్ రెండో దాడికి సిద్ధమవుతుందేమో అనే భయాందోళన ప్రారంభమైంది..  చైనాలో 80వేలకిపైగా కేసులు నమోదైతే..వుహాన్‌లోనే సగం నమోదయ్యాయ్. ఇలా కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో తిరిగి మళ్లీ వ్యాధి తిరగబెట్టిన లక్షణాలు కన్పిస్తున్నాయ్.. ఇలా పాజిటివ్ వచ్చిన వారే తిరిగి కొత్త కేసులకు క్యారియర్లుగా మారతారేమో అన్న భయం ప్రారంభమైంది. ఐతే ఇది కరోనా టెస్టులలోనే తేడాతో జరిగి ఉంటుందనే మరో వాదనా ఉంది..ఏదెలా ఉన్నా..కరోనాని జయించాలంటే మాత్రం నియంత్రణతోనే సాధ్యమనేది మాత్రం చైనా అనుభవంతో నేర్చుకోవాల్సిన పాఠం.