Pak Protests : ఇమ్రాన్ సర్కార్ కి వ్యతిరేకంగా రోడ్లపైకి ప్రజలు!

ఆందోళనలతో పాకిస్థాన్​ అట్టుడుకుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు

Pak Protests : ఇమ్రాన్ సర్కార్ కి వ్యతిరేకంగా రోడ్లపైకి ప్రజలు!

Imran

Updated On : October 25, 2021 / 10:07 AM IST

Pak Protests  ఆందోళనలతో పాకిస్థాన్​ అట్టుడుకుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్బణం,నిరుద్యోగం, విపరీతంగా పెరిగిన గ్యాస్, విద్యుత్‌, నిత్యావసరాల ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలతో రహదారులపై నిరసనలకు దిగుతున్నారు.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శనివారం వందలాది మంది కార్మికులు శనివారం నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా రాసిన బ్యానర్లను ప్రదర్శించారు. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌కు తెలియదని.. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ అనర్హుడని జమియత్ ఉలేమా ఇ ఇస్లాం సంస్థ నేత రషీద్ సూమ్రో అన్నారు.

ఇక,లాహోర్‌లో భద్రతా దళాలు, ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులను నిరసనకారులు హత్య చేయగా.. చాలామంది ఆందోళన కారులు గాయపడ్డారు. గత ఏడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్ట్‌ అయిన టీఎల్పీ పార్టీ నేత షాద్ రజ్వీని విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు ఇస్లామాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న వారిని భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు రహదారులను దిగ్బంధించారు.

మరోవైపు, ఫారెక్స్ మార్కెట్‌లో పాకిస్థాన్ రూపాయి ప‌త‌నం కొన‌సాగుతున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా పాకిస్థాన్ రూపీ బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌స్తున్న‌ది. అమెరికా డాలరుతో పాకిస్తానీ రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని రీతిలో క్షీణించింది.

ALSO READ Ghulam Nabi Azad : జమ్మూకశ్మీర్ విషయంలో ఆ తప్పు చేయొద్దు