US Elections 2024 : అమెరికా వ్యక్తికి చేదు అనుభవం.. ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేశాడు.. కోపంతో భార్య విడాకుల నోటీసు పంపింది!
US Elections 2024 : అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసినందుకు అమెరికాకు చెందిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతడి భార్య ఆగ్రహంతో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసింది.

husband speechless as wife files for divorce after he voted for Trump
US Elections 2024 : డోనాల్డ్ ట్రంప్ ఓటు వేయడం అతడి కొంప ముంచింది. ట్రంప్‌కు మద్దతుగా ఓటు వేసినందుకు అమెరికాలోని ఓ వ్యక్తికి అతడి భార్య విడాకుల నోటీసు పంపింది. రాజకీయాల కారణంగా పచ్చని కాపురం కూలిపోతుందనే విషయం తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, విడాకులు కూడా ఇంత త్వరగా వస్తాయా? అంటూ భర్త విస్తుపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన నిరాశను వ్యక్తపరిచాడు. ఇదంతా ట్రంప్‌కు మద్దతుగా ఓటు వేయడమే కారణమని తెలుస్తోంది.
ట్రంప్ కు ఓటు వేశానని చెప్పడంతో అతడి భార్య ఆగ్రహంతో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసింది. నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్‌పై భారీ విజయం సాధించారు. అధ్యక్ష ఫలితాలు ఇంకా ప్రకటించకముందే ఈ ఎన్నికలు ఊహించిన దానికంటే ముందుగానే వచ్చాయి. ట్రంప్‌కు ఊహించిన దానికంటే భారీ మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా వ్యక్తికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
దీనిపై బాధిత వ్యక్తి స్పందిస్తూ.. “నేను ట్రంప్‌కు ఓటు వేశాను. నా భార్య నాకు విడాకుల నోటీసులను పంపింది. ఎవరైనా ఇంత త్వరగా విడాకులను పొందగలరని నాకు తెలియదు” అని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఆవేదనను వెలిబుచ్చాడు. మా నాన్న ఆటోల రిపేరింగ్ పని చేస్తున్నందున తన భార్య ఇప్పుడు కుటుంబాన్ని కూడా బెదిరిస్తోందని వాపోయాడు.
అంతేకాదు, ఆర్థిక స్థిరత్వం లేదని తెలిసి కూడా తన ఇంట్లో వాటా కావాలని భార్య డిమాండ్ చేస్తోందని తెలిపాడు. తనకు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఇంటి దస్తావేజుపై తన భార్య పేరు ఉందని, తనఖాపై ఆమె పేరు లేదని చెప్పాడు. అతని పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ పోస్టుకు 12.5 మిలియన్ల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నెటిజన్లలో కూడా దీనిపై తీవ్ర చర్చకు దారితీసింది.
సోషల్ మీడియాలో పోస్టు వైరల్ :
ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది నెటిజన్లు విభిన్న రీతిలో స్పందించారు. “రాజకీయాల వల్ల అన్నింటినీ వదిలేసుకునే వ్యక్తిని మీరు వివాహం చేసుకున్నందుకు నేను ఆశ్చర్యపోయాను. బహుశా మీ భార్య కూడా అలాగే భావిస్తుంది” మరో యూజర్ కామెంట్ చేశారు.
“ట్రంప్ గెలుపుతో చాలా మంది మహిళలు ఇప్పుడు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారని మరో యూజర్ పోస్టు చేశాడు. “ట్రంప్‌కు ఓటు వేయడం విడాకులకు మాత్రమే కారణమని భావిస్తున్నాను. వాస్తవానికి విడాకులకు కారణం బహుశా మరేదైనా కావచ్చు” అని మరొకరు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Read Also : Jio Star Website : జియోస్టార్ కొత్త ఓటీటీ వెబ్‌సైట్ ఇదిగో.. కమింగ్ సూన్..!