హా..హా.. : నాగినిగా భయపెట్టిన భార్య.. చితక్కొట్టిన భర్త

  • Published By: chvmurthy ,Published On : January 8, 2019 / 06:56 AM IST
హా..హా.. : నాగినిగా భయపెట్టిన భార్య.. చితక్కొట్టిన భర్త

ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలకు డిజైన్ చేసినన్నివెరైటీలు పురుషులకు కూడా ఉండవు. మహిళల కోసం ఎప్పటి కప్పుడు కొత్త కొత్త వెరైటీలు, డిజైన్లు మార్కెట్ ని ముంచెత్తుతుంటాయి.  మహిళలు అందరికంటే భిన్నంగా ఉండాలనే మోజుతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు. మార్కెట్ లోకి  కొత్తగా వచ్చిన లెగ్గింన్స్ ఓమహిళను ఆస్పత్రి పాలు చేసిన ఘటన మెల్ బోర్న్ లో జరిగింది. 
వివరాల్లోకి వెళితే మెల్ బోర్న్ లోనివసించే  ఓ పాకిస్తానీ మహిళ బట్టలషాపు కెళ్లి కొత్తగా వచ్చిన స్నేక్ డిజైన్ తో ఉన్న లెగ్గింగ్స్ చూసి ముచ్చట పడి కొనుక్కుంది. కొన్నతర్వాత వాటితో తన భర్తను ఆట పట్టించాలనుకుంది. ఇంటికి వచ్చి రాత్రి పడుకునే ముందు తాను కొన్న స్నేక్ డిజైన్ తో ఉన్న లెగ్గింగ్స్ వేసుకుని పడుకుంది.  కాళ్లు మాత్రం కనపడేలా, మొఖానికి దుప్పటి కప్పుకుని పడుకుంది. రాత్రి ఆమె గదిలోకి వచ్చిన భర్త తన భార్య మంచంపై రెండు పాములు ఉండటం చూసి షాక్ గురయ్యాడు. కొంచెం దగ్గరకెళ్లి చూసినా అవి పాములుగానే కనపడ్డాయి అతనికి. తన భార్యకు అపాయం జరగుకూడదని, వెంటనే ఇంట్లోకి వెళ్లి బేస్ బాల్ బ్యాట్ తీసుకువచ్చి వాటిని చితక బాదసాగాడు. కాళ్లపై తగులుతున్న బ్యాట్ దెబ్బలు భరించలేని భార్య భయంతో కేకలు వేయసాగింది.  
మంచంపై పాములను చూసిన భార్య భయంతో అరుస్తోందనుకున్నసదరు భర్తగారు మరింతగా రెచ్చిపోయి కొట్టసాగాడు. భాధను భరించలేని భార్య ఎలాగోలా భర్తను ఆపగలిగింది. కొట్టటం ఆపి విషయం తెలుసుకున్న భర్త వెంటనే తనభార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కాళ్లను పరీక్షించిన డాక్టర్లు కాలి ఎముకలు విరిగినట్టు తేల్చి కట్లుకట్టి చికిత్స అందిస్తున్నారు. గత 2రోజులుగా  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు పాకిస్దానీ కమ్యునిటీ ఇన్ ఆస్ట్రేలియా అనే ఫేస్ బుక్ పేజీలో ఉన్నాయి. వీటిని అనేక మంది  నెటిజన్లు  షేర్  చేస్తూ తమతమ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.