UK Parliament : బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించిన హైదరాబాద్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థి పిల్లారిశెట్టి సాయిరాం

హైదరాబాద్‌కు చెందిన మెడిసిన్ విద్యార్థికి బ్రిటన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది.‘హెల్త్‌ హీరో’ విభాగంలో బ్రిటిష్‌ పార్లమెంట్‌లో పిల్లారిశెట్టి సాయిరాం ప్రసంగించాడు.

UK Parliament : బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించిన హైదరాబాద్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థి పిల్లారిశెట్టి సాయిరాం

Hyderabad Youngster Sai Ram Pillarisetti In Uk Parliament

Updated On : February 24, 2022 / 11:01 AM IST

Hyderabad youngster Sai Ram Pillarisetti in UK Parliament: హైదరాబాద్‌కు చెందిన మెడిసిన్ విద్యార్థికి బ్రిటన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌లోని లాంకషైర్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పిల్లారిశెట్టి సాయిరాం బ్రిటన్‌ పార్లమెంట్ లో ప్రసంగించే అరుదైన గౌరవం దక్కింది. ‘హెల్త్‌ హీరో’ విభాగంలో మంగళవారం బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సాయిరాం ప్రసంగించాడు. వ్యాక్సిన్ ఈక్విటీతో సహా ప్రజారోగ్య సమస్యలపై ఎంపీలతో సంభాషించడానికి యూకే పార్లమెంట్‌కు ‘హెల్త్ హీరో’గా సాయిరామ్ కు ఆహ్వానం అందింది.

ఈ ప్రసంగంలో సాయిరాం ‘ప్రపంచాన్ని కొవిడ్‌ అతలాకుతలం చేసిందని, కొన్ని పేదదేశాలు కేవలం 12% మాత్రమే మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకోగలిగాయరి..ప్రపంచ దేశాలు కొవిడ్‌తోపాటు క్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి కృషి చేస్తున్నాయి‘ అని ప్రసంగించాడు.యునిసెఫ్, ది వన్ క్యాంపెయిన్ (గ్లోబల్ పేదరిక వ్యతిరేక సంస్థ), సేవ్ ది చిల్డ్రన్ మరియు ఇతరులు ఫిబ్రవరి 22న నిర్వహించిన UK హౌస్ ఆఫ్ పార్లమెంట్‌లో జరిగిన ఇంటరాక్షన్ ఈవెంట్‌లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన వైద్య విద్యార్థి సాయి రామ్.

హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి ఫౌండేషన్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి ప్రపంచంలోనే మొదటిసారిగా మొబైల్‌ యాప్‌ను రూపొందించిందని సాయిరాం ఈ సందర్భంగా పార్లమెంట్ కు వెల్లడించాడు. యునిసెఫ్‌ నిర్వహించిన సేవ్‌ చిల్డ్రన్‌ క్యాం పెయిన్‌లో ఫిబ్రవరి 22 నిర్వహించిన యూకే హౌప్ ఆప్ పార్లమెంట్ లో జరిగిన ఇంటరాక్షన్ ఈవెంట్లో పాల్గొన్న సాయిరాం పలు విషయాలు మాట్లాడాడు.

ఈవెంట్‌లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన వైద్య విద్యార్థి సాయి రామ్ కావటం విశేషం.ప్రపంచవ్యాప్తంగా నలుగురు హెల్త్‌ హీరోలను ఎంపిక చేయగా అందులో సాయిరాం ఒకరు. సాయిరాం తండ్రి పి.రఘురాం ప్రముఖ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డాక్టర్ గా ఉన్నారు.ఈ ఈవెంట్ లో సాయిరాంతో పాటు జనరల్ ప్రాక్టీషనర్, డాక్టర్ ఫిలిప్ హేవుడ్, హాస్పిటల్ కన్సల్టెంట్, డాక్టర్ అలెక్సా వర్డీ మరియు నర్సు హెలెన్ బ్రిడ్జ్‌లను కూడా పాల్గొన్నారు.