BrahMos missile misfire: గత మార్చి నెలలో బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ జరిగి, పాకిస్తాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన ప్రభుత్వం తాజగా ఇందుకు బాధ్యులైన ముగ్గురు ఐఏఎఫ్ అధికారులను విధుల నుంచి తొలగించింది.
గత మార్చి 9న సాధారణ పరీక్షల్లో భాగంగా ఒక బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ జరిగింది. ఇలా ప్రయోగించిన క్షిపణి, పాకిస్తాన్‌లోని మియాన్ చన్ను అనే ప్రాంతంలో పడింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కూడా ఇది పొరపాటే. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. అదే నెల 15న ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. దీనిపై భారత వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు విచారణ జరిపారు. తాజాగా ఈ ఘటనకు ముగ్గురు ఐఏఎఫ్ అధికారులు బాధ్యులుగా నిర్ణయిస్తూ, వారిని విధుల్లోంచి తప్పించారు.
Teen kills friend: స్కూలు తప్పించుకునేందుకు జైలుకు వెళ్లాలని.. స్నేహితుడిని చంపిన విద్యార్థి
మంగళవారం నుంచే విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సస్పెండైన ముగ్గురిలో ఒక గ్రూప్ కెప్టెన్ ఉండగా, మరో ఇద్దరు వింగ్ కమాండర్ స్థాయి అధికారులు ఉన్నారు.