Teen kills friend: స్కూలు తప్పించుకునేందుకు జైలుకు వెళ్లాలని.. స్నేహితుడిని చంపిన విద్యార్థి

స్కూలుకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థి అది తప్పించుకునేందుకు జైలుకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం నేరం చేయాలని భావించాడు. ఏకంగా స్నేహితుడినే గొంతు కోసం చంపేశాడు.

Teen kills friend: స్కూలు తప్పించుకునేందుకు జైలుకు వెళ్లాలని.. స్నేహితుడిని చంపిన విద్యార్థి

Teen kills friend: స్కూలుకు వెళ్లి చదువుకోవడం తప్పాలంటే జైలుకు వెళ్లడం ఒక్కటే మార్గం అనుకున్నాడో విద్యార్థి. జైలుకు వెళ్లాలంటే ఏదైనా నేరం చేయాలని ఏకంగా స్నేహితుడినే చంపాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌, ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీరట్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం జరిగింది.

Too fat to fit: లావుగా ఉన్నాడంటూ వదిలేసిన ప్రియురాలు.. అద్దిరిపోయే బాడీతో షాకిచ్చిన యువకుడు.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థికి స్కూలుకు వెళ్లి, చదువుకోవడం ఇష్టం లేదు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. చదువు మానేస్తానని చెప్పినప్పటికీ వాళ్లు బలవంతంగా స్కూలుకు పంపించేవాళ్లు. దీంతో స్కూలుకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించాడు. జైలుకు వెళ్తే మాత్రమే రోజూ స్కూలుకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని భావించాడు. జైలుకు వెళ్లాలంటే ఏదైనా పెద్ద నేరం చేయాలనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితుడినే చంపాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తనతో స్నేహం చేసే రెండేళ్ల చిన్న వయసున్న (14 సంవత్సరాలు) బాలుడిని తనతోపాటు బయటికి తీసుకెళ్లాడు. కాలక్షేపం కోసం బయటకు వెళ్లొద్దామని చెప్పి వెంట తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వేరే ఎవరూ లేరని నిర్ధరించుకుని, పగిలిపోయిన గాజు బాటిల్ ముక్కతో ఆ బాలుడి గొంతు కోశాడు.

Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య

దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి, ఆ బాలుడు అక్కడే మరణించాడు. ఆ తర్వాత నేరుగా దగ్గర్లోని పోలీస్ పోస్టుకు వెళ్లి, జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టమ్ కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. తనకు స్కూలుకు వెళ్లడం ఇష్టంలేక, అది తప్పించుకునేందుకే తన స్నేహితుడిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి వయసు పదహారేళ్లే కావడంతో కోర్టు సూచన మేరకు జువైనల్ హోంకు తరలించారు.