నేను క్షేమం : పైలెట్ విక్రమ్ వీడియో రిలీజ్ చేసిన పాక్ ఆర్మీ

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 01:12 PM IST
నేను క్షేమం : పైలెట్ విక్రమ్ వీడియో రిలీజ్ చేసిన పాక్ ఆర్మీ

Updated On : February 27, 2019 / 1:12 PM IST

తాను క్షేమంగానే ఉన్నాను అని పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలెట్ విక్రమ్ అభినందన్ తెలిపారు. పాక్ అధికారులు తనను ఇంటరాగేట్ చేశారని, పలు ప్రశ్నలు అడిగారని చెప్పారు. విమానాల వివరాలు, మిషన్ గురించి కూపీ లాగే ప్రయత్నం చేశారని.. కానీ తాను ఆ వివరాలు ఏవీ వారికి చెప్పలేదని అభినందన్ వెల్లడించారు.

విక్రమ్ అభినందన్‌కు సంబంధించిన ఒక వీడియోను పాక్ ఆర్మీ తాజాగా విడుదల చేసింది. పాక్ అధికారులు అభినందనన్‌ను క్వశ్చన్ చేయడం, టీ తాగుతూ ఆ ప్రశ్నలకు అభినందన్ సమాధానాలు ఇవ్వడం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో ద్వారా పాక్ కస్టడీలో ఉన్న పైలెట్ అభినందన్ సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పాక్ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read:క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..

యుద్ధ ఖైదీ పట్ల అమానుషంగా ప్రవర్తించారు అనే అపవాదు రాకుండా, అంతర్జాతీయ సమాజం నుంచి తమపై ఒత్తిడి పెరగకుండా చూసుకునేందుకు పాక్ మరో డ్రామాకు తెరతీసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేను క్షేమంగానే ఉన్నాను అని బలవంతంగా అభినందన్ తో చెప్పించిందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మన భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ విమానాలను తరుముతూ.. భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు పాక్ భూభాగంలోకి వెళ్లడం, వాటిని పాక్ ఆర్మీ కూల్చివేయడం తెలిసిందే. భారత్ కు చెందిన మిగ్ 21ను పాక్ కూల్చేసింది. అయితే అందులో ఉన్న వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా పాక్ భూభాగంలోకి ల్యాండ్ అయ్యారు. వెంటనే ఆయనను చుట్టుముట్టిన పాక్ సైనికులు పాశవికంగా దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించి హింసించారు. ఆ తర్వాత తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలపై దాడి చేయకూడదు.
Also Read:పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే

కానీ పాక్ సైనికులు నిబంధనలను ఉల్లంఘించి భారత పైలెట్ పట్ల పాశవికంగా వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విక్రమ్ అభినందన్ పై పాక్ సైనికులు దాడి చేసిన దృశ్యాలు సంచలనంగా మారాయి. పాక్ ఆర్మీ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని కవర్ చేసుకోవడానికి… నేను క్షేమంగా ఉన్నానని విక్రమ్ తో చెప్పిస్తూ పాక్ తాజాగా వీడియో విడుదల చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:పాక్ వైఖరి మార్చుకోవాల్సిందే : రష్యా, చైనా