కింద నుంచి కొండ పైకి ఎక్కుతున్న సముద్రం నీరు

కింద నుంచి కొండ పైకి ఎక్కుతున్న సముద్రం నీరు

Updated On : January 11, 2020 / 11:38 PM IST

వీడియోను చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఏదో అల వచ్చి ఎగసిపడిన నీరు కాదు.. పర్వతం కంటే ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. 470మీ ఎత్తున్న పర్వతాన్ని తాకకుండా వేగంగా నీరు దూసుకెళ్తుంది. వాతావరణ నిపుణులు దీనిని వాటర్ స్పౌట్ అంటున్నారు. అంటే గాలి ఒత్తిడికి నీరు పిల్లర్ లా మారుతుందన్న మాట. టోర్నడో రూపంలో గిరగిర తిరుగుతూ ఆకాశమంత ఎత్తులోనూ ఏర్పడుతుందని అంటున్నారు. 

ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి స్పందిస్తూ.. నేను గాల్లోకి ఏదో వెళ్తుండటం గమనించా. తదేకంగా చూసినప్పుడు అర్థమైంది. నీరు పర్వతం కొసను తాకూత ఓ సర్కిల్ షేప్ లో పైకి వెళ్తుందని తెలుసుకున్నాడు. సాధారణంగా మనం చిన్న చిన్న నదులలోనుంచి నీరు.. రోడ్ల మీదరకు రావడం చూసే ఉంటాం. దీనిని మా ఫ్రెండ్స్ కు పంపించా. వారంతా ఆశ్చర్యపోయారు’ అని చెప్పాడు. 

వాతావారణ అధికారి మాట్లాడుతూ.. ‘ఇది ఒక నీటి స్తంభంలా అనిపిస్తుంది. దీనిని టోర్నడో అని కూడా అనొచ్చు. కాకపోతే నీటి మీద ఏర్పడేది. పర్వతం అంచుకు తాకేసరికి ఆ వాటర్‌కు సర్కిల్ షేప్ లో తిరగడం ఈజీగా అయిపోతున్నట్లుందని వెల్లడించారు.