Kiwi Fruit: ఇరాన్‌కి నో చెప్పిన ఇండియా.. కివీ ఫ్రూట్ ఇక రాదు

ఇరాన్ నుంచి కివీస్ ప్రూట్ ను దిగుమతి చేసుకోవడాన్ని ఇండియా ప్రభుత్వం పూర్తిగా నిషేదించింది. ఎరువులు ఎక్కువగా వేయడం వల్ల ఆ దేశానికి పలు మార్లు హెచ్చరికలు అందినప్పటికీ మార్పు రాలేదు.

Kiwi Fruit: ఇరాన్‌కి నో చెప్పిన ఇండియా.. కివీ ఫ్రూట్ ఇక రాదు

Kiwi Friuit

Updated On : December 14, 2021 / 8:00 AM IST

Kiwi Fruit: ఇరాన్ నుంచి కివీస్ ప్రూట్ ను దిగుమతి చేసుకోవడాన్ని ఇండియా ప్రభుత్వం పూర్తిగా నిషేదించింది. ఎరువులు ఎక్కువగా వేయడం వల్ల ఆ దేశానికి పలు మార్లు హెచ్చరికలు అందినప్పటికీ మార్పు రాలేదు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ యాక్షన్ తీసుకుంది. డిసెంబర్ 7నుంచి కివీ పండ్లను ఇండియాలోకి దిగుమతి చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు.

‘నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఇష్యూ చేసిన ఫైటోశానిటరీ సర్టిఫికేట్స్ ను 2021 డిసెంబర్ 8నుంచి పట్టించుకోవడం లేదు’ అంటూ ఇరానియన్ కౌంటర్ పార్ట్ కు లేఖ ద్వారా తెలిపింది కేంద్ర మంత్రిత్వ శాఖ. గతంలో దిగుమతి అయిన పండ్లలో పెస్టిసైడ్ శాతం ఎక్కువగా ఉందని ఇండియా నుంచి పలుమార్లు హెచ్చరికలు అందినప్పటికీ ఖాతరు చేయలేదు.

‘రెగ్యూలర్ బేసిస్ మీద పంపిన రిక్వెస్ట్‌లు బేఖాతరు చేయలేదు. అందుకే దిగుమతులు తగ్గించేశాం’ అని ఆ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. పైగా గతంలో జరిగిన దిగుమతులపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుపుతామని అన్నారు.

…………………………….. : లోక్‌అదాలత్‌‌లో 1755 కేసుల పరిష్కారం

ప్రస్తుతం ఇండియా విదేశాల నుంచి 4వేల టన్నుల కివీ ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది. దేశీయంగా 13వేల టన్నులను ఉత్పత్తి చేస్తున్నట్లు గవర్నమెంట్ డేటాలో ఉంది.