చైనాను బతిమాలడం పాత మాట, మిస్సైల్స్ తో ఢీకొట్టడం నేటి వ్యూహం

India-China border: Brahmos, Akash, Nirbhay missiles : సరిహద్దులో ఇండియా , చైనా పోటాపోటీగా భారీ ఆయుధాలు మోహరిస్తున్నాయి. చైనా అత్యంత రహస్యంగా ఆయుధ సంపత్తి సరిహద్దులకు చేర్చింది. ఈ సంగతిని పసిగట్టింది ఇండియా. పొరుగుదేశం నుంచి ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోడానికి ఇండియా సిద్ధం అయ్యింది. అంతేనా? వ్యూహాత్మక ఆయుధాలను సరిహద్దులకు తానూ తరలించింది.
మరోపక్క, సాయుధ దళాలకు అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ నిర్ణయాలు తీసుకుంది. అదేసమయంలో సరిహద్దు ఉద్రిక్తతల సడలింపుపై రెండు దేశాల మధ్య దౌత్యస్థాయిలో ఈ వారం మరో విడత చర్చలకు రంగం సిద్ధం అయ్యింది .