ఆనందం ఎక్కడ.. ఎప్పుడూ ఏడుపే : ఇంకా దిగజారిన ఇండియా
ఆనందం.. సంతోషం.. హ్యాపీ.. హ్యాపీనెస్.. పదాలు వేరైనా.. భావం ఒక్కటే.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియాలో 2019 ఏడాదిలో హ్యాపీనెస్ కరువైపోయిందట.

ఆనందం.. సంతోషం.. హ్యాపీ.. హ్యాపీనెస్.. పదాలు వేరైనా.. భావం ఒక్కటే.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియాలో 2019 ఏడాదిలో హ్యాపీనెస్ కరువైపోయిందట.
ఆనందం.. సంతోషం.. హ్యాపీ.. హ్యాపీనెస్.. పదాలు వేరైనా.. భావం ఒక్కటే.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియాలో 2019 ఏడాదిలో హ్యాపీనెస్ కరువైపోయిందట. 2018 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో హ్యాపినీస్ దారుణంగా పడిపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. 2018లో 133వ ర్యాంకులో ఉన్న భారత్.. 2019 ఏడాది వచ్చేసరికి ఒక్కసారిగా ఏడు స్థానాలకు దిగజారిపోయింది. దీంతో ఇండియా ప్రస్తుతం 140వ ర్యాంకులో కొనసాగుతోంది.
Read Also : జేడీని చూడగానే జగన్ కు దడ.. వైసీపీ కబ్జాల నుంచి ఆయన కాపలా : పవన్
ఫస్ట్ ర్యాంకులో ఫిన్ లాండ్.. వరుసగా రెండోసారి
ప్రపంచ స్థాయిలో హ్యాపీనెస్ కంట్రీస్ లో వరుసగా రెండో సారి ఫిన్ లాండ్ టాప్ ర్యాంకులో నిలిచినట్టు యూఎన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తెలిపింది. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన అమెరికా హ్యాపీనెస్ దేశంగా 19వ స్థానంలో నిలిచింది. మార్చి 20, 2019న యూఎన్ కు చెందిన డెవలప్ మెంట్ సొల్యుషన్స్ నెట్ వర్క్ రిలీజ్ చేసిన నివేదికలో వెల్లడించింది.
పాక్, చైనా కంటే వెనుకే..
ఇండియా కంటే హ్యాపీనెస్ స్థానాల్లో పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా ముందు వరుసలో నిలిచాయి. పాకిస్థాన్ 67వ ర్యాంకులో, బంగ్లాదేశ్ 125వ ర్యాంకులో నిలవగా, చైనా 93వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచ దేశాల్లో హ్యాపీనెస్ దేశాలను గుర్తించేందుకు ఇన్ కమ్, ఫ్రీడమ్, ట్రస్ట్, హెల్తీ లైఫ్, సోషల్ సపోర్ట్ , జెనరొసిటీ (ఔదార్యం) మొత్తం ఆరు కీలక అంశాలై వరల్డ్ పోల్ నిర్వహించారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ 2012లో వరల్డ్ హ్యాపీనెస్ డేను ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాదిలో 156 హ్యాపీనెస్ కంట్రీలపై సర్వే నిర్వహిస్తున్నారు.
అసలు కారణం ఇవేనట..
కొన్నిఏళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా హ్యాపీనెస్ క్రమంగా పడిపోతుందని ఈ ఏడాది రిలీజ్ చేసిన నివేదిక చెబుతోంది. ఇందులో అత్యధికంగా హ్యాపీనెస్ తగ్గిపోయిన దేశాల్లో భారత్ ఒకటిగా పేర్కొంది. దేశ ప్రజల్లో ఎక్కువగా నెగిటీవ్ ఎమోషన్స్, ఆందోళన, బాధ, కోపం ఎక్కువ స్థాయిలో ఉన్నదని గుర్తించినట్టు నివేదిక తెలిపింది. హ్యాపీనెస్ కంట్రీల్లో వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో ఫిన్ లాండ్ నిలవగా.. తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఐస్ లాండ్, నెదార్లాండ్స్ నిలిచాయి.
యుద్ధవాతావరణం నెలకొన్న సౌత్ సూడన్ లో నివసించే ప్రజల్లో చాలామంది సంతోషంగా లేరని తెలిపింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (155), అఫ్ఘానిస్థాన్ (154), టాంజానియా (153), రావాండా (152) ర్యాంకులో నిలిచాయి. ప్రపంచ దేశాలపై గాలప్ వరల్డ్ పోల్ అడిగిన ప్రశ్నల ఆధారంగా హ్యాపీనెస్ స్టడీ ర్యాంకులను వెల్లడించారు. జీడీపీ, సోషల్ సెక్యూరిటీ సహా పలు అంశలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకుల జాబితాను రిలీజ్ చేశారు.
Read Also : టీ టీడీపీ కి మరో షాక్: టీఆర్ఎస్ లో చేరనున్న మహిళా నేత