Arunachal Pradesh: చైనా బరితెగింపు.. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్ల మార్పునకు ప్రయత్నం.. భారత్ తీవ్ర అభ్యంతరం..

చైనా ప్రయత్నాలను తాము తీవ్రంగా తిరస్కరిస్తున్నామని తెలిపారు.

Arunachal Pradesh: చైనా బరితెగింపు.. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్ల మార్పునకు ప్రయత్నం.. భారత్ తీవ్ర అభ్యంతరం..

Updated On : May 14, 2025 / 6:26 PM IST

Arunachal Pradesh: చైనా బరితెగించింది. భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్ల మార్పునకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. చైనా వక్ర బుద్ధిపై మండిపడింది. ఆ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లుగా చెప్పింది.

భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫలయత్నాలు చేస్తున్నట్లుగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇది భారత వైఖరికి విరుద్ధమని విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చైనా ప్రయత్నాలను తాము తీవ్రంగా తిరస్కరిస్తున్నామని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్ భాగమని, విడదీయరాని భాగమని, పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవం మార్చలేరంటూ భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 

వాస్తవాధీన రేఖ వెంట ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ చైనా నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో 6 ప్రదేశాలకు పేర్లు మారుస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మారుస్తూ జాబితాను చైనా విడుదల చేసింది. చైనా చేస్తున్న ఈ చర్యలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.