IndVsEng 5th Test : సెంచరీతో కదంతొక్కిన జడేజా, బుమ్రా సంచలన బ్యాటింగ్.. భారత్ భారీ స్కోర్

ఇంగ్లండ్‌తో 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టీమిండియా భారీ స్కోర్ చేసింది. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు.(IndVsEng 5th Test)

IndVsEng 5th Test : ఇంగ్లండ్‌తో 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టీమిండియా భారీ స్కోర్ చేసింది. 84.5 ఓవర్లలో 416 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయ్యింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగాడు. జడేజా 194 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 13 ఫోర్లు ఉన్నాయి. టెస్ట్ కెరీర్ లో జడేజాకు ఇది 3వ శతకం కాగా, భారత్ వెలుపల ఇదే తొలి సెంచరీ.

Rishabh Pant Sixes : క్రికెట్ గాడ్ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్

338/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం రెండోరోజు మహ్మద్‌ షమీతో కలిసి బ్యాటింగ్‌ ఆరంభించిన జడేజా 183 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. షమీ (31 బంతుల్లో 16 పరుగులు.. మూడు ఫోర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 80వ ఓవర్‌ చివరి బంతికి షమీ షాట్‌పిచ్‌ బంతిని గాల్లోకి ఆడి క్రాలే చేతికి చిక్కాడు. దీంతో 371 పరుగుల వద్ద భారత్ తన ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే అండర్సన్‌ బౌలింగ్‌లో జడేజా కూడా బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 375/9.(IndVsEng 5th Test)

తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో (4, వైడ్లు(5), నోబాల్ ‌(6), 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. బుమ్రా 16 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి.

టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. అయితే, అండర్సన్‌ వేసిన మరుసటి ఓవర్‌ ఐదో బంతికి సిరాజ్‌ (2) ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌ ముగిసింది. 416 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలిరోజు.. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సయమంలో రిషబ్ పంత్‌ (111 బంతుల్లో 146 పరుగులు.. 20×4, 4×6), జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.

Jasprit Bumrah: సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌రం: ద్ర‌విడ్‌

కాగా, భారత జట్టు.. టెస్టుల్లో 100లోపే ఐదు వికెట్లు కోల్పోయాక 400 పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి. 2013లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో పోరులో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్.. చివరికి 453 పరుగులు చేసింది. 1983లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌ తో మ్యాచ్ లో 92 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత్.. చివరికి 451 పరుగులు చేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లో టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ రిషబ్ పంత్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్ లో పంత్ 111 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 19 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు