Jasprit Bumrah: సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌రం: ద్ర‌విడ్‌

ఒక ఫాస్ట్ బౌల‌ర్ సార‌థిగా వ్య‌వ‌హ‌రించ‌డం అంత సుల‌భ‌మైన‌ విష‌య‌మేమీ కాద‌ని ద్రవిడ్ తెలిపారు. త‌న బౌలింగ్‌పై దృష్టి పెట్ట‌డ‌మే కాకుండా, అత‌డు బౌలింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఫీల్డింగ్‌ను సెట్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

Jasprit Bumrah: సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌రం: ద్ర‌విడ్‌

Dravid

Jasprit Bumrah: భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య నేడు ప్రారంభ‌మైన‌ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ బాధ్య‌త‌లు ఫాస్ట్ బౌల‌ర్‌ జ‌స్ప్రిత్ బుమ్రా నిర్వ‌హిస్తున్న విష‌యంపై ప్రధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ స్పందించారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు క‌రోనా సోక‌డంతో ఈ టెస్టులో సారథిగా బుమ్రాకు అవకాశం దక్కింది. దాదాపు 35 ఏళ్ళ త‌ర్వాత ఓ ఫాస్ట్ బౌల‌ర్ టెస్టు జ‌ట్టుకు సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్క‌డం ఇదే తొలిసారి. దీనిపై ద్రవిడ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… బుమ్రా టీమిండియా సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌ర‌మ‌ని అన్నారు.

Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం

బుమ్రా చాలా శ్ర‌ద్ధ‌తో బాధ్య‌త‌లు నిర్వ‌హించే వ్య‌క్తి అని ద్రవిడ్ చెప్పారు. ఆట గురించి బుమ్రా బాగా ఆలోచిస్తాడ‌ని, ఆట కొన‌సాగుతున్న తీరును బాగా అర్థం చేసుకుంటాడ‌ని తెలిపారు. ప్ర‌త్య‌ర్థుల బ్యాటింగ్‌కు త‌గ్గ‌ట్టు తాను ఎలా బౌలింగ్ చేస్తున్నాన‌నే విష‌యాన్నీ బాగా అర్థం చేసుకుంటాడ‌ని చెప్పారు. ఆట గురించి చాలా ఆస‌క్తిగా అన్ని విష‌యాలు తెలుసుకుంటాడ‌ని, అలాగే తోటి ఆట‌గాళ్ళ‌తో చ‌ర్చిస్తాడ‌ని తెలిపారు. జ‌ట్టుకి దిశానిర్దేశం చేయ‌గ‌ల‌డ‌ని, ఒక నాయకుడికి ఇది చాలా ముఖ్య‌మ‌ని చెప్పారు. నాయ‌కుడికి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు.

Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

గ‌తంలో సార‌థిగా వ్య‌వ‌హరించిన అనుభ‌వం అంత‌గా లేక‌పోయిన‌ప్ప‌టికీ బుమ్రాకు తాము మ‌ద్దతు తెలుపుతామ‌ని ద్రవిడ్ చెప్పారు. ఒక ఫాస్ట్ బౌల‌ర్ సార‌థిగా వ్య‌వ‌హ‌రించ‌డం అంత సుల‌భ‌మైన‌ విష‌య‌మేమీ కాద‌ని తెలిపారు. త‌న బౌలింగ్‌పై దృష్టి పెట్ట‌డ‌మే కాకుండా, అత‌డు బౌలింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఫీల్డింగ్‌ను సెట్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. కాగా, ఇంగ్లండ్ బ్యాటింగ్ శైలిపై తాము ఎంతో చ‌ర్చించామ‌ని రాహుల్ ద్ర‌విడ్ అన్నారు. అన్ని ర‌కాల ప‌రిస్థితుల్లో బాగా బౌలింగ్ చేయ‌గ‌లిగేలా నాలుగైదు ఏళ్ళుగా తాము ఫాస్ట్ బౌల‌ర్ల‌ను త‌యారు చేయ‌డంపై దృష్టి పెట్టామ‌ని తెలిపారు.