Young Scientist : ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా భారత సంతతి బాలిక

indian american girl Gitanjali rao is time kid of the year : 15 ఏళ్ల బాలిక ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు ప్రతిష్ఠాత్మక ‘టైమ్’ మేగజైన్ నుంచి అరుదైన గుర్తింపు లభించింది. గీతాంజలిని ఎంగ్ సైంటిస్టుగా ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ‘టైమ్’ మేగజైన్ గుర్తించింది.
తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. వంటి పలు అంశాల సమస్యలకు గీతాంజలి టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని మేగజైన్ ప్రశంసలు కురిపించింది. చిన్ననాటి నుంచి గీతాంజలికి ఇంత చక్కటి యత్నాలు చేస్తున్న ఆమె భవిష్యత్తులో మంచి విజయాలు అందుకోవాలని ఆకాంక్షిచింది.
దాదాపు 5 వేల మందితో పోటీ పడి గీతాంజలి రావు ఈ అవార్డును దక్కించుకుందని టైమ్ వెల్లడించింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే గీతాంజలిని ప్రముఖ హాలీవుడ్ నటి..యాక్షన్ సినిమాల్లో హీరోకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో ఫీట్లు..ఫైట్లు చేసే ఏంజెలినా జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేయడం విశేషం.
ఏంజెలినా జోలీ అడిగిన ఓ ప్రశ్నకు గీతాంజలి చేసే పరిశోధనల గురించి అడుగగా..‘‘గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం” తన ప్రయోగమని చాలా క్లియర్ గా సమాధానం చెప్పింది. ఆమె సమాధానానికి ఏంజెలినా చాలా ముగ్ధురాలైంది.
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథమున్న యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని గీతాంతాంజలి సూచించింది. తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యనూ పరిష్కరించాలని అనుకోవడం కంటే..మనల్ని బాగా కదిలించిన సమస్య గురించి ఆలోచించి, పరిష్కారం కోసం యత్నించాలని తెలిపింది.
ఈ తరం ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్కరినీ సంతోషంగా చూడాలన్నదే తన లక్ష్యమని, దానికోసం సైన్స్ ను ఉపయోగించుకుంటు ముందుకు వెళతానని గీతాంజలి తెలిపింది.