Embassy
Indian Embassy In Kabul అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. తాలిబన్ కమాండర్ ముల్లా బరాదర్ దేశ అధ్యక్ష పగ్గాలు చేప్టటే అవకాశముంది. అయితే అప్ఘాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పటైన తర్వాత దేశంలో అరాచకం తీవ్రస్థాయికి చేరుతుందని అప్ఘాన్ భయపడుతున్నారు. వేల మంది అప్గానీయులు దేశం వదిలి పారిపోయారు. ఇక ఎటూ పోయే వీలు లేక చాలా మంది అప్ఘానీయుులు దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
దేశం విడిచి వెళ్లిపోడం కోసం రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో అప్ఘానీయులు కాబూల్ విమానశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో విమానశ్రయం కిక్కిరిసిపోయింది. అయితే వాణిజ్య విమాన సర్వీసులు నిలిపివేయబడి, ఆయా దేశాలు.. తమ దేశాల పౌరులు,సిబ్బందిని తరలించేందుకు మాత్రమే విమానసర్వీసులు నడుపుతున్న నేపథ్యంలో కాబూల్ విమానశ్రయంలోనే దిక్కుతోచని స్థితిలో తమ కోసం ఏ విమానం వస్తుందో అని పెద్ద సంఖ్యలో అప్ఘానీయులు ఎదరుచూస్తున్నారు.
ఇక,అప్ఘానిస్తాన్ రాజధాని కాబూలోని చాలా దేశాల రాయబార కార్యాలయాలు తాత్కాలికంగా మూతబడ్డాయి. చాలా దేశాలు తమ ఎంబసీల్లోని సిబ్బందిని సురక్షితంగా స్వదేశాలకు తరలించాయి. యితే కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం ఇంకా మూసివేయబడలేదు. స్థానిక సిబ్బంది కాన్సులర్ సేవలను అందిస్తున్నారని సమాచారం. అప్ఘానిస్తాన్ నుంచి భారతదేశానికి తిరిగి రావడానికి 1,650 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
కాగా కాబూల్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందువులు మరియు సిక్కులకు స్వదేశానికి తిరిగి రావడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సోమవారం భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పరస్పర అభివృద్ధి ప్రమోషన్ లో మన భాగస్వాములైనవారిని మరియు విద్యా, ఇతర విషయాల్లో మన భాగస్వాములు అయిన అఫ్ఘాన్‌లకు అండగా నిలుస్తామని కూడా భారత్ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని భారత పౌరుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఇందులో భాగంగా ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి కాబుల్ వెళ్లిన ప్రత్యేక భారత వైమానిక దళ విమానం సీ-17…కాబూల్ నుంచి 150 మంది అధికారులు,సిబ్బందిని తీసుకొని మధ్యాహ్నాం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ల్యాండ్ అయింది. ఆఫ్గాన్ లో ఇంకా మిగిలి ఉన్న భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరినీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రత దళాల రక్షణ నడుమ ఉంచినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరందరినీ భారత్ కి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు