కేంద్రం యాక్షన్ : అమెరికాలోని స్టూడెంట్స్ కోసం హెల్ప్ లైన్

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 06:01 AM IST
కేంద్రం యాక్షన్ : అమెరికాలోని స్టూడెంట్స్ కోసం హెల్ప్ లైన్

Updated On : February 2, 2019 / 6:01 AM IST

ఢిల్లీ : అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న విద్యార్థులు, అరెస్ట్ అయిన స్టూడెంట్స్ కు సాయం చేసేందుకు కేంద్రం కదిలింది. ఎంబసీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. తమ పరిధిలో టాప్ ప్రియార్టీగా ఈ అంశం ఉందని మినిస్టర్ ఆఫ్ ఎక్స్‌టెర్ననల్ అఫైర్ ప్రకటించింది. అమెరికాలోని పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు ఆ శాఖ అధికారి. అమెరికా అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు…వివరాల కోసం అయినా బాధితులు, వారి కుటుంబ సభ్యులు కాంటాక్ట్ కావటానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇది 24 గంటలూ పని చేస్తున్నట్లు తెలిపింది.  సీనియర్ ఎంబసీ అధికారులు పర్యవేక్షించి సమాధానాలిస్తారని తెలిపారు. అక్కడున్న విద్యార్థులను రక్షించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని రవీష్ కుమార్ వెల్లడించారు.

హెల్ప్ లైన్ నెంబర్లు : +1 202-322-1190, +1 202-340-2590
Email : cons3.washington@mea.gov.in

అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్ టన్ ని ఫేక్ యూనివర్శిటీగా అమెరికా భద్రతా బలగాలు గుర్తించారు. చదువు పేరుతో అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న 600 మందిని నిర్భంధించారు. విద్యార్థులను యూనివర్శిటీలో చేర్చేందుకు సహకరించిన మధ్యవర్తులనూ అరెస్ట్ చేశారు. యూనివర్శిటీలో 99శాతం మంది తెలుగు విద్యార్థులే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.