కరోనావైరస్ కారణంగా కోవిడ్-19 వ్యాధికి గురై పూర్తిగా ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఓ యువతికి రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్చారు డాక్టర్లు. అమెరికాలోని షికాగోలో భారత సంతతి వైద్యుడు, థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి యుఎస్‌లో ఇదే మొదటి శస్త్రచికిత్స అని డాక్టర్లు చెబుతున్నారు.
చికాగోలోని ఆసుపత్రిలో ఆ 20 ఏళ్ల యువతి చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆమె రెండు ఊపిరితిత్తులు పాడైన విషయాన్ని గుర్తించిన డాక్టర్లు వాటిని మార్చాలని నిర్ణయించారు. ఆమెకు ఊపిరితిత్తులు మార్చకుంటే బతకదు అని నిర్ణయించారు. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స చేశారు.
కరోనా బాధితుల్లో అవయవ మార్పిడి ఆపరేషన్ చాలా సవాళ్లతో కూడుకున్నది. అయినప్పటికీ డాక్టర్ అంకిత్.. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఊపిరితిత్తులు సేకరించి శస్త్ర చికిత్స చేసినట్లు వెల్లడించారు. నేను చేసిన కష్టతరమైన మార్పిడిలలో ఇది ఒకటి అని భరత్ అన్నారు. కరోనావైరస్ వల్ల కలిగే వ్యాధి సాధారణంగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. మూత్రపిండాలు, హృదయాలు, రక్త నాళాలు మరియు నాడీ వ్యవస్థపై కూడా నష్టం కలిగిస్తుంది.
Read: వచ్చేవారమే కరోనా చికిత్సకు హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్!