Indian Para Shuttlers : ఉగాండాలో వరుస పేలుళ్లు..తృటిలో తప్పించుకున్న భారత టీమ్
ఉగాండా రాజధాని కంపాలాలో ఇవాళ వరుస పేలుళ్లు జరిగాయి. అయితే భారత పారా బ్యాడ్మింటన్ టీమ్ బస చేసిన హోటల్ కు 100 మీటర్ల దూరంలోనే ఈ వరుస పేలుళ్లు సంభవించాయి.

Uganda
Indian Para Shuttlers ఉగాండా రాజధాని కంపాలాలో ఇవాళ వరుస పేలుళ్లు జరిగాయి. అయితే భారత పారా బ్యాడ్మింటన్ టీమ్ బస చేసిన హోటల్ కు 100 మీటర్ల దూరంలోనే ఈ వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో భారత పారా బ్యాడ్మింటన్ జట్టు గురించి యావత్ దేశం ఆందోళన చెందింది. అయితే పేలుళ్ల నుంచి భారత టీమ్ తృటిలో తప్పించుకుంది.
ఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనేందుకు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ఇటీవల ఉగాండా వెళ్లింది. ఉగాండా వెళ్లిన టీమ్ లో జట్టులో టోక్యో పారాలింపిక్స్-2021లో పతక విజేతలు ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్, ఇతర ఆటగాళ్లు ఉన్నారు.
మరోవైపు, ఉగాండా రాజధాని కంపాలాలో ఇవాళ మధ్యాహ్నాం రెండు పేలుళ్లు జరిగాయని, పలువురు గాయపడ్డారని ఉగాండా సైనిక ప్రతినిధి తెలిపారు. అయితే మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ALSO READ Viruses from China: చైనా నుంచి మరో 18 వైరస్‌లు కనుగొన్న సైంటిస్టులు