Chai Pani Restaurant in US : అమెరికాలో ఉత్తమ రెస్టారెంటుగా భారతీయ ‘చాయ్‌పానీ’ ఎంపిక

అమెరికాలో ఉత్తమ రెస్టారెంటుగా భారతీయ ‘చాయ్‌పానీ’ ఎంపిక అయ్యింది.

Chai Pani Restaurant in US : అమెరికాలో ఉత్తమ రెస్టారెంటుగా భారతీయ ‘చాయ్‌పానీ’ ఎంపిక

Chai Pani Restaurant In Us

Updated On : June 15, 2022 / 12:31 PM IST

Chai Pani Restaurant in US : భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంటి పేరుందో మరోసారి రుజువైంది. అమెరికాలోని మన భారతీయ రెస్టారెంట్ ‘ఉత్తమ రెస్టారెంట్’గా ఎంపిక అయ్యింది. అమెరికాలో మన ఇండియన్స్‌ ఏర్పాటు చేసిన ‘చాయ్‌పానీ’ స్ట్రీట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ ఉత్తమ రెస్టారెంటుగా ఎంపికైంది. చికాగోలోని జేమ్స్‌ బియర్డ్‌ ఫౌండేషన్‌ ప్రతీ సంవత్సరం అవార్డులను ప్రకటిస్తుంది.

2022కు గాను చాయ్‌పానీని ఎంపిక అయ్యింది. నార్త్‌ కరోలినాలోని అష్‌విల్లేలో ఉన్న ఈ రెస్టారెంటు అందరికీ బాగా తెలిసిందే. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రెస్టారెంట్ లో తినటం జరుగుతుంటుంది. ఇక్కడ దొరికే ‘చాట్‌’ చాలా ఫేమస్‌. దీంతో ఈ రెస్టారెంట్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. చాట్ ప్రేమికులకు చాయ్ పానీ రెస్టారెంట్ కు వచ్చిన తినటం అలవాటుగా ఉంటుంది. పైగా ఇక్కడ ధరలు కూడా వేరే రెస్టారెంట్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయంటారు ఫుడ్ ప్రేమికులు.