భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్’ నుంచి 60మందిలో 12మంది పైలట్లను పక్కకపెట్టేసింది. మూడు నెలలుగా 12మంది పైలట్ల కోసం జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో భాగంగా ఐఏఎఫ్ కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వైద్య పరీక్షలు నిర్వహించింది. .
ఇందులో పంటి సమస్యల కారణంగా 12మంది పైలట్లను పక్కకుబెట్టేశారు. అక్కడి వాతావరణానికి పళ్ల సమస్య ఉంటే సరిపోరని తేల్చేసింది. తొలిసారి అంతరిక్షంలోకి మానవులను పంపే ప్రయోగాన్ని చేపట్టిన భారత్.. రష్యాతో కలిసి ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. భారత్ నుంచి 60మంది ఐఏఎఫ్ పైలట్లను రష్యాలోని యూరిగగారియన్ కాస్మొనాట్ ట్రైనింగ్ సెంటర్ లో 45 రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో ముగ్గుర్ని మాత్రమే 2022లో అంతరిక్షంలోకి పంపిస్తారు.
రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్‌మస్ సబ్సిడెయిరీ గ్లావొకోస్మాస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. అంతరిక్షంలో మనుగడకు అవసరమైన ప్రాణాధార వ్యవస్థను వివిధ పరికరాల సాయంతో ఏర్పాటుచేస్తున్నారు. గాలి, నీరు, ఆహారంతో శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచడం, మానవ వ్యర్థాలను తొలగించడం తదితర కార్యకలాపాలలో శిక్షణ ఇస్తున్నారు. థర్మల్ కంట్రోల్ సిస్టమ్ మిషన్ అన్ని దశల్లోనూ వ్యోమనౌక వ్యవస్థలను అనుకూలమైన ఉష్ణోగ్రత పరిధిలో ఉంచుతుంది.
వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి వారి సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం చాలా ముఖ్యం. తొలిసారిగా మానవుని అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్ కు రు.10,000 కోట్లను కేంద్రం కేటాయించింది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న కార్యక్రమంలో, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, వినియోగం, అధునాతన కంప్యూటర్లను తయారీకి దీనిని కేటాయించారు. గగన్‌యాన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి వెళ్లి కనీసం వారం రోజులపాటు గడపనున్నారు. ఇటీవల ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ.. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు సమయం చాలా తక్కువ ఉంది, అయినప్పటికీ ఇస్రో దీనిని సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.