కొత్త స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ క్వాల్‌కామ్ చిప్‌సెట్ అప్ డేట్ తో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ జీపీఎస్ పై ఆధారపడిన స్మార్ట్ ఫోన్లు ఇకపై భారత సొంత నేవిగేషన్ సిస్టమ్ NavIC ఆధారంగా పనిచేయనున్నాయి. ఈ NavIC అనేది అమెరికా GPS మాదిరి నేవిగేషన్ సిస్టమ్ లాంటిదే.
నేషనల్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం జియోసింక్రోనస్, జియో స్టేషనరీ భౌగోళిక కక్షలో మొత్తం ఎనిమిది IRNSS శాటిలైట్లు ఉన్నాయి. IRNSS-1A అనే భారత తొలి నావిగేషన్ ఉపగ్రహాన్ని 2013లో ప్రయోగించింది.
నావిక్ దాని ప్రాధమిక ప్రాంతమైన భారతదేశంలో 20 మీటర్ల కంటే మెరుగైన స్థాన ఖచ్చితత్వం కోసం రూపొందించారు. భారత సరిహద్దు నుండి 1,500 కిలోమీటర్ల విస్తీర్ణం కూడా ఈ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. ఇది వినియోగదారులందరికీ ప్రామాణిక స్థాయి సేవను అధీకృత వినియోగదారులకు గోపత్యతో పరిమితమైన సేవను అందిస్తుంది.
నావిక్ డ్రైవర్లు, భారతదేశంలోని ఇతర వినియోగదారులకు దృశ్య వాయిస్ నావిగేషన్‌ను అందిస్తుంది. ప్రథమ లబ్దిదారులుగా ఈ సేవలను పొందుతున్న భారతీయ నావికులు మత్స్యకారులకు నావిక్ హ్యాండ్‌సెట్‌లను అందిస్తున్నారు.