IPL auction 2022: ఐపీఎల్ వేలంలో స్పృహ తప్పి పడిపోయిన నిర్వహకుడు హ్యూ ఎడ్మీయడస్
ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Ipl Auctioneer Huge Edmeades Collapsed While Auctioning
IPL auction 2022 : ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అందరూ ఆందోళనలకు గుయ్యారు. అప్పటికి శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నారు. ఈక్రమంలో అతని ధర వివరాలు ప్రకటిస్తూ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఉన్నట్టుండి ముందుకు వాలిపోయారు. దాంతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో టీవీ చానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు. ఎడ్మీయడస్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హ్యూ ఎడ్మీయడస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా సమాచారం.
హ్యూ ఎడ్మీయడస్ బ్రిటన్ జాతీయుడు. 2018 నుంచి ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ వేలం నిర్వహించగా, మ్యాడ్లీ బ్రిటన్ లో అంపైర్ గా నియమితుడు కావడంతో, అతడి స్థానంలో ఎడ్మీయడస్ వేలం నిర్వహణ చేపట్టారు. గత కొన్ని సీజన్లుగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా వేలం నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
మాడ్లే స్థానంలో ఆక్షనీర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హ్యూగోకు….పురాతన వస్తువుల వేలం నిర్వహణలో మాత్రమే అనుభవం ఉంది. కళాఖండాలు, వింటేజ్ కార్ల వేలం నిర్వహించే వ్యక్తి. ఆయనకు కళ్లు తిరిగి కాస్త అస్వస్థతకి గురయ్యైన క్రమంలో ప్రస్తుతం అతను చికిత్స్ పొందుతున్నారు.
కాగా..ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో భారత స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఈ ధనాధన్ ఆటగాడ్ని రూ.12.25 కోట్లు పెట్టి కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాడు. హర్షల్ ను రూ.10.75 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. గత సీజన్ లో ఆర్సీబీ తరఫున 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్ పై నమ్మకం ఉంచిన ఛాలెంజర్స్.. మరోసారి అతడ్ని కొనుగోలు చేసింది. కగిసో రబాడ, శిఖర్ ధవన్, జేసన్ హోల్డర్, నితీశ్ రాణా కూడా మంచి ధర పలికారు. రబాడను రూ.9.25 కోట్లు, శిఖర్ ధవన్ ను రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. జేసన్ హోల్డర్ ను రూ.8.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, నితీశ్ రాణాను రూ.8 కోట్లకు కేకేఆర్ దక్కించుకున్నాయి.