అమెరికా దళాలపై మరోసారి ఇరాన్ రాకెట్ దాడులు
అమెరికా దళాలపై మరోసారి ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. 12 రాకెట్ లాంచర్లతో ఇరాక్‌లోని అమెరికా దళాలపై విరుచుకుపడిన 24గంటల్లోనే మరో అటాక్ చేసింది.

అమెరికా దళాలపై మరోసారి ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. 12 రాకెట్ లాంచర్లతో ఇరాక్‌లోని అమెరికా దళాలపై విరుచుకుపడిన 24గంటల్లోనే మరో అటాక్ చేసింది.
అమెరికా దళాలపై మరోసారి ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. 12 రాకెట్ లాంచర్లతో ఇరాక్‌లోని అమెరికా దళాలపై విరుచుకుపడిన 24గంటల్లోనే మరో అటాక్ చేసింది. బాగ్దాద్‌లో మరో రెండు క్షిపణులతో దాడికి పాల్పడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండటంతోపాటు… అమెరికా దళాల వ్యూహాలకు సంబంధించిన కీలక స్థావరం సహా విదేశీ రాయబార కార్యాలయాలుండే బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్‌లో రాకెట్లతో విరుచుకుపడింది. అమెరికా సహనానికి సవాల్ విసిరింది.
ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. అనుకున్నట్టుగానే అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులతో మంగళవారం విరుచుకుపడింది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా సైనికులకు ఆతిథ్యం ఇస్తున్న ఐన్ అల్-అస్సాద్ తో వైమానిక స్థావరంపై 12 రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడుల్లో 80మంది అమెరికా జవాన్లు మరణించారని కూడా ప్రకటించింది. అంతలోనే అగ్రరాజ్యానికి మరో షాక్ ఇచ్చింది. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో బాగ్దాద్‌లో భారీ దాడులకు పాల్పడింది. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.
అటు ఇరాకీలు కూడా అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన ఉగ్రవాది, పారామిలిటరీ చీఫ్ ఖైస్ అల్ ఖజాలీ కూడా అగ్రరాజ్యాన్ని హెచ్చరించారు. అమెరికాకు ఇరాన్ దాడులకంటే మించి చూపిస్తామని అన్నారు. హషేద్ సానుభూతిపరులైన హర్కత్ అల్ నుజాబ్ సైతం అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా సైనికులారా మీరు కళ్లు మూసుకోకండి.. మీ చివరి సైనికుడు ప్రాణాలు తీసేవరకు ఇరాకీలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించింది. అమెరికా చర్యలకు తాము వెనక్కి తగ్గబోమని ఇరాన్ సుప్రీమ్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. అమెరికా ఒక నేరానికి పాల్పడితే.. దానికి బదులుగా వారు దీటైన ప్రతిస్పందన ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడాన్ని సహించబోమన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇరాన్ దాడిలో ఏ ఒక్క అమెరికన్‌కు హాని జరగలేదని ట్రంప్ స్పష్టం చేశారు. సులేమాని వందలాది అమెరికన్ల మృతికి కారకుడని ఆరోపించారు. ఉగ్రవాద గ్రూపులకు సులేమాని శిక్షణ ఇచ్చారని తెలిపారు. అమెరికా యుద్ధాన్ని కాంక్షించడం లేదన్నారు. పశ్చిమాసియాలో అశాంతిని ప్రోత్సహిస్తే సహించబోమని చెప్పారు.