Iran Israel War: ఇజ్రాయెల్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇరాన్..? మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణి దాడి..?

మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా ఇటు ఇజ్రాయల్ అటు అమెరికాకు సమాచారం ఇచ్చిన ఇరాన్ దాడులను మాత్రం ఆపడం లేదు.

Iran Israel War: ఇజ్రాయెల్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇరాన్..? మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణి దాడి..?

Updated On : June 18, 2025 / 11:16 AM IST

Iran Israel War: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. గురి తప్పకుండా మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా గ్లిలాట్ లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైన క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. ఇజ్రాయల్ పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తోందంటే దానికి కారణం మొస్సాద్ సంస్థే.

ఇరాన్ లో అణు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న సంగతి నుంచి కీలక అధికారులు, సైంటిస్టుల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయల్ కు చేరవేసింది. అంతేకాకుండా ముందుగానే ఇరాన్ కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుక ఈ సంస్థ హస్తముంది. ఈ నేపథ్యంలోనే మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణి ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే, ఇరాన్ చెప్పే దాంట్లో వాస్తవం లేదంటోంది ఇజ్రాయెల్. మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణి దాడి వార్తలను ఇజ్రాయల్ ఖండించింది. ఎలాంటి దాడి జరగలేదంది.

Also Read: ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి..! పశ్చిమాసియా వైపు కదులుతున్న అగ్రరాజ్యం యుద్ధ విమానాలు..!

మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా ఇటు ఇజ్రాయల్ అటు అమెరికాకు సమాచారం ఇచ్చిన ఇరాన్ దాడులను మాత్రం ఆపడం లేదు. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ సంఘర్షణపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే తన పర్యటన ముగించుకుని ఆఘమేఘాల మీద అమెరికా పయనం అయ్యారు. ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమానికి నిజమైన ముగింపు ఉండాలని ట్రంప్ చెప్పడం యుద్ధం తీవ్రత మరింత పెరుగుతుందన్న సంకేతాలు ఇస్తోంది.

 

జూన్ 13న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను ప్రారంభించింది. ఇరాన్ పై దాడులకు దిగింది. ఆ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. అలా రెండు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి.