Bushehr Nuclear Power Plant : ఇరాన్ ఏకైక న్యూక్లియర్ పవర్ ఫ్లాంట్ మూసివేత

ఇరాన్ లోని ఏకైక న్యూక్లియర్ పవర్ ఫ్లాంట్ ను తాత్కాలికంగా మూసివేశారు.

Bushehr Nuclear Power Plant : ఇరాన్ ఏకైక న్యూక్లియర్ పవర్ ఫ్లాంట్ మూసివేత

Busher Plant

Updated On : June 21, 2021 / 11:41 AM IST

Bushehr Nuclear Power Plant ఇరాన్ లోని ఏకైక న్యూక్లియర్ పవర్ ఫ్లాంట్ ను తాత్కాలికంగా మూసివేశారు. బుషెహర్ సిటీలోని ఈ అణు విద్యుత్ ఫ్లాంట్ ను అత్యవసరంగా మూసివేయడానికి గల కారణాలను మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. శనివారం నుంచి మొదలైన మూసివేత ప్రక్రియ మూడు నాలుగు రోజులపాటు కొనసాగనుందని ఆ దేశ అధికారి ఒకరు తెలిపారు. ఈ అణు విద్యుత్ కర్మాగారాన్ని అత్యవసరంగా మూసివేయాల్సి రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. దీని కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు తలెత్తుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, 2018లో అమెరికా విధించిన ఆంక్షల కారణంగా రష్యా నుంచి అవసరమైన పార్ట్ లు మరియు పరికరాలు సేకరించలేకపోతున్నందున ఈ ఫ్లాంట్ మూతపడే అవకాశముందని ఈ ఏడాది మార్చిలోనే న్యూక్లియర్ అధికారి మహ్మౌద్ జఫరి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలో ఉత్పత్తి చేయబడిన యురేనియం బుషెర్ ఫ్లాంట్ కు వస్తుందన్న విషయం తెలిసిందే. దీనిని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA)మానిటర్ చేస్తోంది. అయితే తాజాగా ఫ్లాంట్ మూసివేతపై IAEA స్పందించలేదు.