ఇరాక్ లో బాంబు పేలుడు..12మంది మృతి

ఇరాక్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12మంది మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని ఇరాక్ సైనికాధికారి తెలిపారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు దక్షిణాన ఉన్న కర్బాలా నగరం ఎంట్రన్స్ సమీపంలో ఉన్న చెక్ పాయింట్ దగ్గర శుక్రవారం (సెప్టెంబర్ 20)న ఈ పేలుడు సంభవించిందని ఇరాక్ ఐ జాయింట్ ఆపరేషన్ కమాండ్ (జేఓసీ) మీడియా కార్యాలయం జిన్ హువా వెల్లడించింది.
ఈ పేలుడుపై ఓ అధికారి మాట్లాడుతూ..కార్బాలా మరియు అల్-హిల్లా పట్టణాల మధ్య ఇరాక్ ఆర్మీ చెక్ పాయింట్ గుండా ప్రయాణించే బస్సులో బాంబులను అమర్చి.. ప్రయాణికులు ఎక్కిన తర్వాత దాన్ని పేల్చేశారు. పేలుడు జరగటానికి కొంతసేపు ముందు ఒక వ్యక్తి బస్సు నుంచి దిగిపోయాడనీ.. అతనే బస్సులో సీటుకింద బాంబును అమర్చి ఉంటాడని తాము భావిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటన ఇరాకీ పట్టణానికి సమీపంలోని కర్బాలాలో రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరిన్ని బాంబులు ఉన్నాయనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా..ఈ పేలుళ్లకు సంబంధించి తామే బాధ్యలమనే ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా రాలేదనీ ఇరాక్ పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నామన్నారు.