Ireland
Ireland : చాలామంది మంచి అవకాశాల కోసం ప్రాంతాలు మారతారు. దేశాలు దాటి వెళ్తారు. అయితే అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని.. కానీ ఓ దేశం అక్కడికి వెళ్లడానికి డబ్బులిస్తే.. ఆశ్చర్యంగా ఉందా.. నిజమే. ఐర్లాండ్ డబ్బులిచ్చి మరీ తమ దేశానికి రా .. రమ్మని పిలుస్తోంది.
Airplanes Banned: ఆ దేశంలో వినామాలు రద్దు.. కేవలం రైలు ప్రయాణమే.. ఎందుకో తెలుసా?
ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడాలని ఆసక్తి ఉన్న ప్రజలకు అవకాశం ఇవ్వడంతో పాటు.. తన దేశాన్ని ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఐర్లాండ్ దేశం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. అవర్ లివింగ్ ఐలాండ్స్ పాలసీలో భాగంగా ఐర్లాండ్ దీవుల జనాభాను పెంచడానికి ప్రయత్నం చేస్తోంది. అక్కడికి వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారికి €80,000 (మన ఇండియన్ కరెన్సీలో రూ.71 లక్షలు) చెల్లిస్తోంది.
Two Marriages : భలే ఛాన్సులే.. ఆ దేశంలో అబ్బాయిలు రెండో పెళ్లి చేసుకోవాల్సిందే…లేకపోతే జైలుకే
ఈ దీవులలో జనాభా సంఖ్యను విస్తరించడం ద్వారా అభివృద్ధి సాధించడం.. మరియు ఈ ద్వీపాల ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వం మరియు పర్యావరణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక అక్కడికి వెళ్లాలి అనుకునే వారు జూలై 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునట. ఇక ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకుని లగేజ్ సర్దుకోవడమే ఆలస్యమన్నమాట.