Airplanes Banned: ఆ దేశంలో వినామాలు రద్దు.. కేవలం రైలు ప్రయాణమే.. ఎందుకో తెలుసా?

దేశంలో 2.5 గంటలు, అంతకంటే తక్కువ సమయం ప్రయాణం కలిగిన రూట్లలో చిన్న విమానాలు ఏప్రిల్ 2022 నుండి నిషేధించబడతాయని (అవి అంతర్జాతీయ విమానానికి కనెక్ట్ కాకపోతే). ప్రాన్స్ తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదింది.

Airplanes Banned: ఆ దేశంలో వినామాలు రద్దు.. కేవలం రైలు ప్రయాణమే.. ఎందుకో తెలుసా?

Airplanes Banned

Airplanes Banned: స్వల్ప దూర దేశీయ విమానాలను నిషేధిస్తూ ప్రాన్స్ నిర్ణయించింది. 2.5గంటల కంటే తక్కువ రైలు ప్రయాణంతో అనుసంధానించబడిన నగరాల మధ్య విమానాలను రద్దుచేసేందుకు చర్యలను యూరోపియన్ కమిషన్ ఆమోదించింది. శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మార్పులు దేశం 2021 వాతావరణ చట్టంలో భాగం. మొదట ప్రాన్స్ సిటిజన్స్ కాన్ఫరెన్స్ ఆన్ క్టైమేట్ ద్వారా ప్రతిపాదించబడ్డాయి.

Airplane Stuck Under Bridge: అయ్యయ్యో ఎంత పనైంది! బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం..

జనాభాకు అనుకూలంగా మార్చడానికి కొద్ది గంటల ప్రయాణాలకు ప్రైవేట్ జెంట్‌లను ఉపయోగించడంపై ప్రాన్స్ కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రాన్స్‌లో విమానాల వల్ల కలిగే కర్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికితోడు 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 40శాతం తగ్గించే ప్రయత్నంలో భాగం. పర్యావరణ కారణాల దృష్ట్యా విమానాలను నిషేధిస్తూ ఒక దేశం చట్టాన్ని రూపొందించడం కొత్త విధానంగా గుర్తించబడింది. తాజా నిర్ణయం వల్ల ‘పారిస్ ఓర్లీ – బోర్డియక్స్ మధ్య విమానాలు, పారిస్ ఓర్లీ – లియోన్ మధ్య విమానాలు, పారిస్ ఓర్లీ – నాంటెస్ మధ్య విమానాలు తొలివిడత రద్దవుతాయి.

Airplane Restaurant : గుజరాత్ లో తొలి ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్

ప్రస్తుతం ప్యారిస్, లియోన్ లోని విమానాశ్రయాలకు వెళ్లే రైళ్లు ప్రయాణీకులకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదు. కనెక్టింగ్ విమానాలు కూడా ఈ కొత్త నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. గతేడాది ఈ చట్టం అమల్లోకి వచ్చినా నిషేధం అమలుకు మరింత సమయం పట్టనుంది. ఈ చర్యలను పబ్లిక్ కన్సల్టేషన్ కోసం సమర్పించాల్సిన అవసరంఉంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ద్వారా సమీక్షించబడాలని బునెన్ వివరించారు. ఇది సాధ్యమైనంత త్వరగా జరుగుతుందని ఆయన చెప్పారు.